Breaking News

ప్రాణం తీసిన కిటికీ వివాదం

Published on Mon, 10/27/2025 - 10:58

కరీంనగర్‌ కార్పొరేషన్‌: చిన్న కిటికీ వివాదానికి నిండు ప్రాణం బలైన ఘటన కరీంనగర్‌లో సంచలనం సృష్టించింది. పక్కింటి వాళ్లతో పాటు నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ అధికారుల వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతుడు సూసైడ్‌ నోట్‌లో పేర్కొనడం కలకలం రేపుతోంది. కరీంనగర్‌ సిటీలోని రాఘవేంద్రనగర్‌లో వడ్లకొండ లక్ష్మీరాజం శనివారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిబంధనల పేరిట తమ ఇంటి కిటికీలను నగరపాలక సంస్థ అధికారులు పదేపదే తొలగించడం అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. 

తన ఇంటి కిటికీ విషయంపై పక్కింటి వాళ్లతో పాటు, నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వేణు, ఖాదర్‌ వేధించడంతోనే చనిపోతున్నట్లు లక్ష్మిరాజం సూసైడ్‌ నోట్‌ రాశాడు. దాదాపు మూడేళ్లుగా పక్కింటివాళ్లతో కిటికీల విషయంపై లక్ష్మిరాజంకు వివాదం నడుస్తోంది. సెట్‌బ్యాక్‌ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కిటికీని 2023లో మొదటిసారి తొలగించారు. మళ్లీ ఏర్పాటు చేశారంటూ ఈ సంవత్సరం ఆగస్టులో మరోసారి తొలగించారు.

 తన కిటికీలు తొలగించడం, పక్కింటి వాళ్లపై తాను ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో మానసిక వేదనతో లక్ష్మిరాజం ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన పక్కింటి వాళ్లతోపాటు, నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వేణు, ఖాదర్‌పై చర్య తీసుకోవాలని లక్ష్మిరాజం భార్య శారద వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే పక్కింటి వ్యక్తి ఫిర్యాదు, హైకోర్టు ఆదేశాల మేరకే తాము నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కిటికీలు తొలగించామని డిప్యూటీ సిటీ ప్లానర్‌ బషీర్‌ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)