Breaking News

రాచకొండ.. ఇకపై లష్కర్‌!

Published on Mon, 12/29/2025 - 05:22

సాక్షి, హైదరాబాద్‌: బృహత్‌ నగరంగా విస్తరించిన జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడానికి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అదే సమయంలో రాజధానిలోని పోలీసు కమిషనరేట్లనూ పునర్వ్యవస్థీకరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం ఉన్న జోనల్‌ విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసు విభాగం ఈ మేరకు కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రాథమిక కసరత్తు చేసిన అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. శనివారం డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో మార్పుచేర్పులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఆదివారం నిర్వహించిన సమావేశానికి పురపాలక, పోలీసు శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాచ కొండ పేరును లష్కర్‌ కమిషనరేట్‌గా మారుస్తున్న పోలీసు విభాగం ఫ్యూచర్‌ సిటీ కోసం కొత్త కమిషనరేట్‌ ఏర్పాటు చేస్తోంది. బల్దియా ఎన్నికల్లోపే నాలుగు కమిషనరేట్లను అమ లులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.  

ప్రత్యేక జిల్లాగా యాదాద్రి జోన్‌ 
ప్రస్తుతం రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, మహేశ్వరంతోపాటు యాదాద్రి జోన్లు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న నార్త్‌జోన్‌ను రాచకొండలో కలుపుతున్నారు. అలాగే రాచకొండలో భాగమైన యాదాద్రి జోన్‌ను ప్రత్యేక జిల్లాగా మారుస్తున్నారు. 19 పోలీసుస్టేషన్లతో ఉండే దీనికి ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. నార్త్‌జోన్‌తో కలిసి కొత్తగా మారుతున్న రాచకొండ కమిషరేట్‌ పేరును లష్కర్‌ కమిషనరేట్‌గా మారుస్తున్నారు. లష్కర్‌ బోనాలకు సికింద్రాబాద్‌ ప్రాంతం నిలయం కావడం... ఈ ఏరియా నార్త్‌జోన్‌లోనే ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్న పటాన్‌చెరుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను, మొయినాబాద్‌ను సైబరాబాద్‌ కమిషనరేట్‌లోకి చేరుస్తున్నారు. 

హైదరాబాద్‌లోకి ఆ మూడు ప్రాంతాలు 
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలను హైదరాబాద్‌ కమిషనరేట్‌లో కలుపుతున్నారు. ఇప్పుడు శంషాబాద్‌ జోన్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌ పోలీసుస్టేషన్లను హైదరాబాద్‌ కమిషనరేట్‌లోకి తీసుకురానున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ప్రస్తుతం ఏడు జోన్లు ఉండగా... సైబరాబాద్‌లో ఐదు, రాచకొండలో నాలుగు జోన్లు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ మూడు కమిషనరేట్లలోనూ కలిపి 12 జోన్లు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ఆరు, సైబరాబాద్, రాచకొండలో మూడు చొప్పున జోన్లు ఉండనున్నాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని జోన్లను పునర్వ్యవస్థీకరిస్తూ చారి్మనార్, గోల్కొండ తదితరాలను మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

కొత్తగా ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌
సైబరాబాద్‌లో ఉండే కూకట్‌పల్లి జోన్‌లోకి మాదాపూర్‌ ప్రాంతాన్ని తీసుకొస్తూ కొత్తగా కుత్బుల్లాపూర్‌ ప్రత్యేక జోన్‌కు రూపమిచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రస్తుతం రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఉన్న మహేశ్వరం జోన్‌తోపాటు షాద్‌నగర్, చేవెళ్ల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల తదితరాలు ఉండనున్నాయి. ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌లోనూ మూడు నుంచి నాలుగు జోన్లు ఉంటాయని తెలుస్తోంది. ముగ్గురు పోలీసు కమిషనర్లతో సమావేశమైన శివధర్‌రెడ్డి కొన్ని కీలక మార్పులు సూచించారు. ఇవి పూర్తయిన తర్వాత ప్రతిపాదనల్ని సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లనున్నారు. ఆయన ఆమోదంతో పునర్వ్యవస్థీకరణకు తుది రూపు రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (ఏడీజీ) స్థాయి అధికారి, సైబరాబాద్, రాచకొండకు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (ఐజీ) స్థాయి అధికారులు కమిషనర్లుగా ఉంటున్నారు. దీన్నే కొనసాగిస్తూ ఫ్యూచర్‌ సిటీకి ఐజీ స్థాయి అధికారినే నియమించాలని భావిస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)