Breaking News

ఘనంగా బతుకమ్మ వేడుకలు!

Published on Sun, 10/22/2023 - 12:54

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ పండుగ రోజున  'గౌరమ్మను' పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పండుగను అంగరంగా వైభవంగా జరుపుతారు.  ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. పార్వతి గురించి పాటలాగా పాడుతూ.. ఆనందంతో బతుకమ్మను జరుపుకుంటారు. ఆడపడచులు, యువకులు, పిల్లలు, పెద్దలు తమ ఆనందాన్ని చూపే కన్నుల పండుగగా.. తెలంగాణ ప్రజలకు ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ ఈ బతుకమ్మ. 

ఈ సందర్భంగా పల్లెలు, పట్టణాల్లో ఆలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు తీరొక్క పూల శోభ సంతరించుకోనుంది. ఈ క్రమంలో చెరువుల వద్ద నిమజ్జన ప్రదేశాల్లో రంగుల ఆహ్లాదం ఎంతో చూడముచ్చట. పౌష్టికాహారం, చిరుధాన్యాలు, కూరగాయలు, గాజులు, చేతివృత్తులతో తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణీయం.


బతుకమ‍్మ పండుగ కేవలం కటుంబాలకు, ఇంటికే పరిమితం కాదు, తెలంగాణలోని అన్నీ రంగాలవారిగా.. విద్యా, వైద్యా, సాంకేతిక, వివిధ పరిశ్రమల్లో బతుకమ్మ వేడుకల నిర్వహణ ఎంతో కన్నుల పండుగగా చెప‍్పవచ్చు అనడానికి నిదర్శనంగా.. 'డైరెక్టర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ కార్యాలయంలో' శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 'డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్ అకౌంట్స్‌ విభాగం' డైరెక్టర్‌ వి ఫణిభూషణ్‌శర్మ ఈ వేడుకలకు హాజరయ్యారు. 'జాయింట్‌ డైరెక్టర్లు' హెచ్‌ శైలజారాణి, పి రజిని, తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. రంగారెడ్డి హైదరాబాద్‌ 'పే అండ్ అకౌంట్‌ ఆఫిసర్స్‌' మహ్మద్‌ ఆరిఫ్, ఆర్‌ వి రామగోపాల్‌ అండ్‌ స్టాఫ్‌, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ సిబ్బంది, తదితరులు బతుకమ్మ వేడుకల సందర్భంగా హాజరయ్యారు. బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళల్ని మరింత ప్రోత్సహించే దిశలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇలాంటి మరెన్నో పండుగలు జరుపుకోవాలని డైరెక్టర్‌ కోరుతూ.. అందుకు అందరి ప్రోత్సాహం​ ఎంతో అవసరమని తెలిపారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)