Breaking News

ఓటమి నుంచే గాంధీ నేర్చుకున్నారు..

Published on Tue, 10/03/2023 - 01:25

సాక్షి, హైదరాబాద్‌: ‘‘గెలుపు కన్నా ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం.. గాంధీజీ సైతం అలాగే ఓటమి నుంచే నేర్చుకున్నారు.. అందుకని ఏ రంగంలోనైనా ఓడిపోతే కుంగిపోకూడదు ’’ అని ఒడిశా హైకోర్ట్‌ మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌ ఉద్బోధించారు. గాంధీ జయంతి నాడు ప్రముఖుల ప్రసంగాలకు పట్టం కట్టే మంథన్‌ సంవాద్‌ వార్షిక చర్చాగోష్టిని నగరంలోని శిల్పకళా వేదికలో సోమవారం నిర్వహించింది.

కార్యక్రమంలో మాజీ చీఫ్‌ జస్టిస్‌ మురళీధర్‌ మాట్లాడుతూ రాజకీయా ల్లోకి రాక పూర్వం న్యాయవాదిగా గాంధీజీ ఎదుర్కొన్న వృత్తిపరమైన ఆటుపోట్లు, దక్షిణాఫ్రికా లో రెండు దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిలో పొందిన అనుభవాలను ప్రస్తావించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా, నేర్చుకోవడాన్ని మానకుండా సత్యాన్ని వీడకుండా నిరుపేదలకు అండగా గాంధీజీ న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. నవతరం న్యాయవాదులు గాంధీజీ న్యాయవాద ప్రస్థానం నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.

ఉపాధికి దోహదం చేయలేని ఆర్ధికాభివృద్ధి: యామినీ అయ్యర్‌
సిటిజన్‌ వర్సెస్‌ లాభార్థి? అంశంపై  ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ అధ్యక్షుడు యామినీ అయ్యర్‌ మాట్లాడారు. దేశంలో పేర్కొంటున్న ఆర్థికాభివృద్ధి లాభదాయకమైన ఉపాధి అవకా శాలకు, ఉద్యోగాలకు దోహదం చేయలేకపోతోందని అభిప్రాయపడ్డారు. నిజమైన సంక్షేమానికి ఇంకా సరైన నిర్వచనాన్ని వెదికే క్రమంలోనే ఉన్నామన్నారు. ది క్వశ్చన్‌ ఆఫ్‌ అకడమిక్‌ ఫ్రీడమ్‌ అనే అంశంపై లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్‌ నీరజా గోపాల్‌ జయాల్‌ మాట్లాడుతూ  విద్యా సంబంధ స్వేచ్ఛ (అకడమిక్‌ ఫ్రీడమ్‌) అనేది మన దేశంలో ఇంకా తగిన స్థాయిలో లేదన్నారు.

సదస్సులో ‘‘వై ఇండిపెండెంట్‌ న్యూస్‌ మీడియా షుడ్‌ త్రైవ్‌’’ అనే అంశంపై ది న్యూస్‌ మినిట్‌ ఎడిటర్‌ ఇన్‌ ఛీఫ్‌ ధన్యా రాజేంద్రన్‌ మాట్లాడుతూ పారిశ్రామికవేత్త అదానీపై వచ్చిన ఆరోపణల విషయంలో మీడియా పూర్తిస్థాయిలో నిష్పక్షపాత్ర పోషించలేకపోయిందన్నారు.  ఫైటింగ్‌ ది ఫేక్‌ న్యూస్‌ పాండమిక్‌ అనే అంశంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఫేక్‌ న్యూస్‌ ప్రచారం సాగుతోందని ఆరోపించారు. విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ డైరెక్టర్‌ ఆర్ఘ్యాసేన్‌గుప్తా  ‘ది గ్లోబల్‌ కాన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా’ అనే అంశంపై మాట్లాడారు. సదస్సులో హిందీ కవి,వ్యంగ్యరచయిత సంపత్‌ సరళ్‌ పలు కవితలు,వ్యంగ్యరచనలు వినిపించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)