Breaking News

తహసీల్దార్‌ ఆఫీస్‌లో క్షుద్రపూజలు

Published on Thu, 07/09/2026 - 08:02

జగిత్యాల జిల్లా: మూఢనమ్మకాల బారిన పడకుండా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన ప్రభుత్వ అధికారులే మూఢనమ్మకాలను ప్రోత్సహించిన సంఘటన జగిత్యాల జిల్లా, రాయికల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో చోటు చేసుకుంది. తమ సిబ్బంది తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని, కీడు సోకడమే కారణమని మంగళవారం అర్ధరాత్రి దాటాక క్షుద్రపూజలు చేయించారు. కొంతకాలంగా రాయికల్‌ పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయ ఉద్యోగులు, జీపీవోలు వాహన ప్రమాదాలకు గురవుతున్నారు.

 బదిలీపై వచ్చి కార్యాలయంలో అడుగుపెట్టగానే ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు జీపీవోలు ప్రమాదాల బారిన పడ్డారు. దీంతో రెవెన్యూ అధికారులకు భయం పట్టుకుంది. కార్యాలయం ఎదుట క్షుద్రపూజలు చేయించారు. విషయం బయటకు పొక్కకుండా రెవెన్యూ అధికారులు మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు సీసీ కెమెరాలను బంద్‌ చేయించారు. 

కానీ ఒక పిల్లర్‌ దగ్గర గుంత, గొర్రెను బలి ఇచ్చినట్లు ఆనవాళ్లు కనిపించడంతో పట్టణంలో కలకలం రేగింది. బుధవారం ఉదయం మల్లాపూర్‌ మండలం వీవీరావుపేటలోని గంగ వద్ద విందు భోజనాలు కూడా చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ విషయమై తహసీల్దార్‌ నాగార్జునను వివరణ కోరగా.. క్షుద్ర పూజల విషయం తన దృష్టికి రాలేదన్నారు. తహసీల్దార్‌కు తెలియకుండానే కార్యాలయం ఆవరణలో ఇలాంటి వ్యవహారం జరగడం చర్చనీయాంశంగా మారింది. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)