Breaking News

పూజిత ఆత్మహత్యాయత్నం.. ఫోన్‌లో మాట్లాడింది ఎవరు?

Published on Fri, 11/07/2025 - 07:29

సాక్షి, ఘట్‌కేసర్‌: ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలో ఓ ప్రైవేటు కళాశాలలో బీస్సీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. కళాశాల యాజమాన్యం, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్‌ కర్నూల్‌ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన మల్లి పూజిత  పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో ఉంటూ ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ అవుషాపూర్‌ నీలిమా నర్సింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది.

ఆమెకు జ్వరంగా ఉండడంతో స్నేహితులతో కలిసి ఆటోలో కళాశాలకు వచ్చి మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. చాలాసేపు ఫోన్‌లో మాట్లాడిన అనంతరం మూడో అంతస్తు రెయిలింగ్‌పై ఫోన్‌ పెట్టి కిందికి దూకింది. గమనించిన స్నేహితులు కళాశాల సిబ్బందితో కలిసి జోడిమెట్లలోని నీలిమా ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలు పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఆమె స్నేహి తులను అడిగి తెలుసుకున్నారు.

జర్వం రావడంతో మాత్ర వేసుకొని కళాశాలకు ఆటోలో వచ్చిందని వారు తెలిపారు. పూజిత తన  ఫోన్‌ స్టేటస్‌లో బుధవారం సాయంత్రం ‘ద ఎండ్‌’ అని పెట్టుకుందని పోలీసులు తెలిపారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పూజిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూజిత ఆత్మహత్యా యత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఫోన్‌లో ఎవరితో మాట్లాడింది, మరేదైనా కారణం ఉందా? కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)