Breaking News

రోడ్డెక్కిన స్టాఫ్‌ నర్సులు

Published on Sat, 07/20/2024 - 05:48

సాక్షి, హైదరాబాద్, సుల్తాన్‌బజార్‌: వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న హెడ్‌ నర్సు, స్టాఫ్‌ నర్సుల కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ నర్సులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కోఠి ఉస్మానియా మెడికల్‌ కళాశాల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని 7 జోన్లకు ఒకేసారి కౌన్సెలింగ్‌ చేపట్టడంతో కళాశాల ఆడిటోరియంలో గందరగోళం నెలకొంది. డీహెచ్‌ రవీంద్రనాయక్‌ నేతృత్వంలో జరిగిన కౌన్సెలింగ్‌లో గ్రేడ్‌–1 అధికారి సుజాత రాథోడ్‌ వేదికపైకి వచ్చి బదిలీల లిస్టును మార్పు చేయించడంతో నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బదిలీల కౌన్సెలింగ్‌ను పారదర్శంగా నిర్వహించాలని పెద్దపెట్టున నినదించారు. దీంతో డీహెచ్‌ కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది స్టాఫ్‌నర్సులు ధర్నాకు దిగారు. తమకు ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని, డీహెచ్‌ డౌన్‌ డౌన్‌ అని నినదించారు. కొందరు అధికారులు యూనియన్‌ నేతలుగా చెప్పుకుంటున్న వారితో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు.

ఓ యూనియన్‌ నేత రూ.5 కోట్ల వరకు వసూలు చేశాడని.. ఆ సొమ్ములో రూ. 3 కోట్లు  ఒక కీలక అధికారికి కూడా ఇచి్చనట్లు ఆరోపించారు. ఉస్మానియా మెడికల్‌ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డును గంటసేపు దిగ్బంధనం చేశారు. దీంతో సుమారు రెండున్నర గంటల పాటు కోఠి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు వేల సంఖ్యల్లో స్టాఫ్‌ నర్సులను నిలువరించలేకపోవడంతో రాకపోకలు భారీగా నిలిచిపోయాయి.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు