Breaking News

ఓటర్ల సంఖ్య పెరిగినా.. పోలింగ్‌ తగ్గింది

Published on Sat, 12/02/2023 - 00:51

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఈసారి అర్హులైన ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినా, ఆ మేరకు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోక పోవడంతో పోలింగ్‌ శాతం తగ్గింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,26,02,793 మంది ఓటర్లకు గాను 2,32,59,256 మంది (71.34%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1,62,98,482 మంది పురుషులకు గాను 1,15,84,728 మంది, 1,63,01,634 మంది మహిళలకు  గాను 1,16,73,722 మంది, 2,677 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లకు గాను 806 మంది ఓటేశారు. గురువారం నాటి పోలింగ్‌కు సంబంధించిన తుది గణాంకాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) శుక్రవారం రాత్రి విడుదల చేశారు.

అత్యధికంగా మునుగోడులో 91.89 శాతం పోలింగ్‌ నమోదు కాగా..పాలేరు (90.89 శాతం), ఆలేరు (90.77 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా యాకుత్‌పురలో 39.64 శాతం నమోదైంది. మలక్‌పేట (41.32 శాతం), చారి్మ నార్‌ (43.27 శాతం) ఆపై స్థానాల్లో ఉన్నాయి. ఈ సారి ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో ఓటేయడం గమనార్హం. కాగా 2018లో జరిగిన ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఈ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత ఎన్నికల్లో 1.86 శాతం పోలింగ్‌ తగ్గింది. 2018 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మొత్తం 2.8 కోట్ల మంది ఓటర్లుండగా, 2.05 కోట్ల మంది ఓటేశారు. అయితే ఈసారి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగి 3.26 కోట్లకు చేరుకోగా, 2.32 కోట్ల మందే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ కారణంగానే.. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం 26.78 లక్షల మంది ఎక్కువగా ఓటేసినా, పోలింగ్‌ శాతం మాత్రం తగ్గింది. 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)