Breaking News

కార్నియా.. త్రీడీ ప్రింటింగ్‌

Published on Wed, 04/09/2025 - 04:48

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కంటిలో కీలకభాగమైన కార్నియా లోపంతో చూపును కోల్పోతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎవరైనా కళ్లు దానమిస్తే.. ఆ కంటిని అవయవ మార్పిడి చేసి కార్నియాతో చూపు కోల్పోయిన వారికి వైద్యులు చూపును ప్రసాదిస్తారు. ఇప్పుడు కళ్లను దానం చేసే వారిసంఖ్య పరిమితంగా ఉండగా, కార్నియా అవసరమున్న రోగుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. ఈ సమస్యలను అధిగమించడమే లక్ష్యంగా ఐఐటీ హెచ్‌లో (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌)లో ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టు కొనసాగుతోంది. 

త్రీడీ ప్రింటింగ్‌ సాంకేతికతతో ఈ కార్నియాను బయోప్రింటింగ్‌ చేయడంపై పరిశోధనలు చేస్తున్నారు. ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్, సీసీఎంబీ (ది సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మోలిక్యులర్‌ బయోలజీ)లతో కలిసి ఐఐటీహెచ్‌లోని బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఈ పరిశోధన ప్రాజెక్టును చేపట్టింది. ఇది సత్ఫలితాలిస్తుందని ఐఐటీహెచ్‌ బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ విభాగ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ ఫాల్గుణి పఠి ‘సాక్షి’కి తెలిపారు. 

ఈ పరిశోధనల్లో రూపుదిద్దుకున్న త్రీడీ బయో ప్రింటింగ్‌ కార్నియాను ముందుగా జంతువులపై ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే కుందేళ్లపై చేసిన ప్రయోగం మంచి ఫలితాలిచ్చిoది. రానున్న రోజుల్లో ఈ త్రీడీ బయో ప్రింటెడ్‌ కార్నియాను మనుషులపై ప్రయోగించనున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందనున్నారు. 

బయోఇంక్‌తో త్రీడీ  ప్రింటింగ్‌  
రోగుల కళ్ల నుంచి బయోఇంక్‌ (జెల్‌ లాంటి పదార్థం)ను సేకరిస్తారు. దీనికి కొన్ని రకాల సెల్‌లను యాడ్‌ చేసి త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి కార్నియాను ప్రింట్‌ చేస్తున్నారు. సాధారణంగా కార్నియా అనేది 10.8 మిల్లీమీటర్ల నుంచి 12.8 మిల్లీ మీటర్ల సైజులో ఉంటుంది. ఇటీవల కాలంలో 3డి ప్రింటింగ్‌ టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతోంది. 

భవనాలతోపాటు, జ్యువెలరీ, మానవులు, ఇతర జీవుల అవయవాలు.. ఇలా అనేక రకాల వస్తువులను త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే సూక్ష్మస్థాయిలో 10 మి.మీల నుంచి 12 మిల్లీమీటర్ల సైజులో ఉండే ఈ అతి చిన్న మానవ అవయవాన్ని ఇదే త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ ద్వారా రూపొందించడం గమనార్హం. 

4.9 బిలియన్‌ మందికి అంధత్వం  
ప్రపంచంలో సుమారు 4.9 బిలియన్‌ మంది అంధత్వంతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో నాలుగో వంతు కంటిలోని కార్నియాలోపంతోనే అంధత్వం వస్తున్నట్టు తేలింది. ఈ సమస్యకు కంటి దానమే ఇప్పటి వరకు ఉన్న పరిష్కారం. అయితే కళ్లను దానం చేసేవారు తక్కువగా ఉంటున్నారు. అవసరమున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో చాలామంది చూపు లేకుండానే జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు చేస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. 

కళ్ల సేకరణలో ఇబ్బందులు  
కళ్లు దానమిచ్చిన వారినుంచి కంటి సేకరణ ప్రస్తుతం క్లిష్టతరంగా ఉంది. చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి నిరీ్ణత సమయంలో కళ్లను సేకరించాలి. సేకరించిన కళ్లను భద్రపరచడం వంటి ప్రక్రియ కొంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. తగిన వైద్య నిపుణుల అవసరం ఉంటుంది. ఈ క్రమంలో వివిధ కారణాలతో ఒక్కోసారి సేకరించిన కళ్లు పాడైపోయి.. వృథాగా పోతున్న ఘటనలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి సవాళ్లకు ఈ పరిశోధనలు కొంత మేరకు పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కార్నియా దెబ్బతినడానికి ఇవీ కారణాలు..
» ప్రధానంగా ఏమైనా ప్రమాదాలు జరిగి కంటికి గాయాలైతే ఈ కార్నియా దెబ్బతింటుంది.  
» కంటి ఇన్‌ఫెక్షన్‌తో కూడా కార్నియా చెడిపోతుంది.  
»  షుగర్‌ వ్యాధిగ్రస్తులతోపాటు, బీపీ ఉన్న వారికి కూడా క్రమంగా కార్నియాపై ప్రభావం పడుతుంది. దీంతో చూపుమందగించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)