అభ్యర్థులు స్థానిక ఓటరులై ఉండాలి

Published on Thu, 10/09/2025 - 04:33

సాక్షి, హైదరాబాద్‌: తొలిదశ స్థానిక ఎన్ని కలకు గురువారం నోటిఫికేషన్లు జారీ కానుండగా, వెనువెంటనే నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే నామినేషన్ల దాఖలు విషయంలో అభ్య ర్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

» ఫారం–4 (అనుబంధం–3)లో ఉన్న నమూనాలో నామినేషన్‌ పత్రం ఉండాలి
» ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేవారు సంబంధిత ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి
»  పోటీ చేసే అభ్యర్థి, ప్రతిపాదించే వ్యక్తి ఇద్దరి పేర్లు మండల, జిల్లా పరిషత్‌ ఓటర్ల జాబితాల్లో ఉండాలి
»  ఒక స్థానానికి ఒక అభ్యర్థిని వివిధ వ్యక్తులు ప్రతిపాదించవచ్చు
»  ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్‌ వేయొచ్చు కాని ఒక దాంట్లోనే పోటీ చేయాలి.
»  ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానంలో పోటీ చేయొచ్చు
» రిటర్నింగ్‌ అధికారికి నిర్దేశిత ప్రదేశంలో నామినేషన్లు అందజేయాలి
»  గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీ లేదా రిజర్వ్‌డ్‌ చిహ్నం కలిగి రిజిస్టర్‌ అయిన రాజకీయ పార్టీ ద్వారా పోటీ చేస్తున్న అభ్యర్థి, నోటిఫికేషన్‌ ఫారమ్‌–2లో ఆ పార్టీ పేరు నమోదు చేయాలి. రాజకీయ పార్టీ నుంచి పొందిన అభ్యర్థిత్వ ధ్రువీకరణ ఫారమ్‌–బీ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ సాయంత్రం 3 గంటల లోగా సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి
»  రిజర్వ్‌ గుర్తు లేని రిజస్టర్డ్‌ రాజకీయ పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎస్‌ఈసీ సూచించిన రిజర్వ్‌ కాని (ఫ్రీ) చిహ్నాల జాబితా నుంచి ప్రాధాన్యతా క్రమంలో మూడు చిహ్నాలను ఎంపిక చేసుకుని నామినేషన్‌ పత్రంలో సూచించాలి 

నామినేషన్‌ ఫారానికి జత చేయాల్సిన డిక్లరేషన్లు
» ఎస్సీ, ఎస్టీ, బీసీ హోదాకు సంబంధించిన డిక్లరేషన్లు
»  ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం రిజర్వ్‌ చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్‌ ఫారం (అనుబంధం–3తో సంబంధిత కులం, తెగ, తరగతికి చెందినవారిగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
»  ఎస్సీ, ఎస్టీ, బీసీఅభ్యర్థులు పోటీకి డిపాజిట్‌ చేసే మొత్తంలో రాయితీకి అర్హులు
»  రిటర్నింగ్‌ అధికారి ప్రతిరోజు తాను స్వీకరించిన నామినేషన్ల వివరాలను ఫారమ్‌–5లో ప్రచురించాలి.  

Videos

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)