Breaking News

607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

Published on Sun, 06/29/2025 - 05:07

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్టు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూలై 10 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ బోర్డు కార్యదర్శి గోపాకాంత్‌ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 17. వైద్య విద్యలో పీజీ లేదా సూపర్‌ స్పెషాలిటీ కోర్సు చేసినవారు ఈ పోస్టులకు అర్హులు. 

మెడికల్‌ కాలేజీల్లో మరో 714 అసెస్టింట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీటిని కూడా త్వరలోనే భర్తీ చేసేందుకు బోర్డు నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలోని 34 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో పూర్తిస్థాయిలో బోధన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ముందుగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను భర్తీ చేయడం ద్వారా ఇప్పటికే విధుల్లో ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించాలని నిర్ణయం తీసుకుంది. 

2,258 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అవసరం 
రాష్ట్రంలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించి క్యాడర్‌ స్ట్రెంత్‌ను 3,696గా లెక్క తేల్చారు. ప్రస్తుతం 1,390 మంది అసిస్టెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా రెగ్యులర్‌ బేసిస్‌లో పనిచేస్తున్నారు. మరో 985 మంది కాంట్రాక్టు ప్రాతిపదికన విధుల్లో ఉన్నారు. కాగా 34 వైద్య కళాశాలలకు 2,288 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అవసరమని ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ నివేదిక సమర్పించింది. 

దీంతో మొదటగా 607 పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. త్వరలోనే మరో 714 పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తంగా 1,321 మంది కొత్తగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా విధుల్లో చేరుతారు. ఆ వెంటనే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లలో అర్హులైన 231 మందిని అసోసియేట్‌ ప్రొపెసర్లుగా నియమిస్తారు. ప్రస్తుతం అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా ఉన్నవారిలో 308 మందిని ప్రొఫెసర్లుగా నియమించనున్నారు. 

డీపీసీ ప్యానల్‌ 349 మందిని పదోన్నతులకు అర్హులుగా గుర్తించినప్పటికీ, తొలుత 308 మందికి మాత్రమే పదోన్నతులు కల్పించనున్నారు. కాగా, ఇప్పుడున్న ప్రొఫెసర్లలో 44 మందిని అదనపు డీఎంఈలుగా పదోన్నతి కల్పించి, బోధనాసుపత్రులకు సూపరింటెండెంట్లుగా, ప్రిన్సిపాళ్లుగా నియమిస్తారు. 

రెండు రోజుల క్రితమే 48 డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్, 2 స్పీచ్‌ థెరపిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయగా, గడిచిన 17 నెలల్లో ఆరోగ్య శాఖలో 8 వేలకు పైగా వివిధ పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవి కాకుండా మరో 2,322 నర్సింగ్‌ ఆఫీసర్లు, 732 ఫార్మసిస్ట్, 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్, 1,931 మల్టీ పర్పస్‌ ఫిమేల్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)