Breaking News

2,620 వైన్‌ షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్‌

Published on Fri, 09/26/2025 - 00:35

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే రెండేళ్ల కాలానికి (డిసెంబర్‌ 1 నుంచి 2027 నవంబర్‌ 30 వరకు) కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో 2,620 మద్యం దుకాణాలకు ఈ నెల 26 నుంచి ఆక్టోబర్‌ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. దరఖాస్తు రుసుమును రూ. 3 లక్షలుగా ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది. తద్వారా దాదాపు రూ. 3 వేల కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతుందని అంచనా వేస్తోంది. 

దరఖాస్తుతోపాటు రూ. 3 లక్షల డీడీ లేదా చలాన్‌ రూపంలో చెల్లించిన రసీదు జత పరచాల్సి ఉంటుందని ఎక్సైజ్‌శాఖ పేర్కొంది. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాల కోసమైనా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించారు. ఆయా దుకాణాలకు దరఖాస్తు చేసుకొనే వారు ఫీజుతోపాటు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. 

ఒకవేళ గడువులోగా ఆ పత్రం అందకపోతే నవంబర్‌ 15 వరకు సమర్పించే వెసులుబాటు ఇచ్చారు. ఈ మేరకు హామీ పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను రిజిస్టర్‌ పోస్ట్, మొయిల్‌ ద్వారా పంపిస్తే స్వీకరించబోమని ఆబ్కారీ శాఖ తెలిపింది. దరఖాస్తులు అందజేసిన వారికి రసీదుతోపాటు అక్టోబర్‌ 23న డ్రాలో పాల్గొనడానికి అవసరమైన ఎంట్రీ పాసు రసీదు ఇస్తామని పేర్కొంది. ఎక్సైజ్‌ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయనివారు దుకాణాలు పొందేందుకు అనర్హులు.   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)