Breaking News

హెచ్‌ఎంపీవీ వైరస్‌ అంత ప్రమాదకరమైనదేమీ కాదు

Published on Thu, 01/09/2025 - 13:02

సుల్తాన్‌బజార్‌: హ్యూమన్‌ మెటాప్యుమో వైరస్‌ (హెచ్‌ఎంపీవీ) వైరస్‌ ఒక ఫ్లూ వంటిదని, సాధారణ నియమాలు పాటిస్తే తగ్గిపోతుందని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ రవీంద్రనాయక్‌ పేర్కొన్నారు. ఈ వైరస్‌ చిన్నపాటి లక్షణాలతో వచ్చే వైరస్‌ అన్నారు. దానిని నియంత్రిస్తే ఎలాంటి ప్రమాదం లేదన్నారు. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపే ఒక రకమైన వైరస్‌ అన్నారు. హెచ్‌ఎంపీవీని మొదట 2001లోనే గుర్తించారని, ఇదేమీ కొత్త వైరస్‌ కాదన్నారు. 

అధిక జనాభా ఉన్న ప్రాంతాలలో ఇది సోకుతుందని.. మన రాష్ట్రంలో ఈ లక్షణాలు ఏమీ లేవన్నారు. హెచ్‌ఎంటీవీ లక్షణాలు తేలికపాటి జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల వరకు ఉంటాయని రవీంద్ర నాయక్‌ పేర్కొన్నారు. జ్వరం, దగ్గు, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, శ్వాసలో ఇబ్బందుల్లాంటి సాధారణ లక్షణాలు ఉంటాయని ఆయన వివరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. హెచ్‌ఎంపీవీని గుర్తించడానికి పీసీఆర్‌ పరీక్ష, యాంటిజెన్‌ డిటెక్షన్, సిరాలజికల్‌ పరీక్షలు చేయవచ్చన్నారు. 

దీని నివారణ కోసం తరచుగా చేతులు కడుక్కోవడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలును ఉపయోగించడం, అస్వస్థతగా ఉన్న వారి నుంచి దూరంగా ఉండడం లాంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్‌ కాలంలో అన్ని వసతులు సౌకర్యాలతో సమర్థంగా ఉందన్నారు. ఈ వ్యాధి అంత ప్రమాదకరమైనది కాదని, చలికాలంలో వచ్చే చిన్నపాటి ప్లూగా ఉంటుందని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని రవీంద్ర నాయక్‌ సూచించారు.  

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు