Breaking News

మహిళా పోలీస్‌..లెక్కలో లెస్‌..

Published on Tue, 04/11/2023 - 04:07

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర జనాభాలో మహిళలు దాదాపు సగం (49.7 శాతం) ఉన్నప్పటికీ... మహిళా పోలీసుల శాతం మాత్రం ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. కేంద్రం అధీనంలోని బ్యూరో ఆఫ్‌ పోలీసు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌ అండ్‌ డీ) గణాంకాల ప్రకారం రాష్ట్ర పోలీసు విభాగంలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది, అధికారుల సంఖ్య 62,731గా ఉండగా అందులో మహిళా పోలీసులు కేవలం 5,349 (8.53 శాతం) మందే ఉన్నారు. 

2021 జనవరి నాటి పరిస్థితుల ఆధారంగా... 
బీపీఆర్‌ అండ్‌ డీ ఏటా అన్ని రాష్ట్రాలు, కమిషనరేట్లలో పోలీసు సిబ్బంది వివరాలను సేకరిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న జనాభాతో పురుష–మహిళా పోలీసులు, సివిల్‌–ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ బలగాల్లోని సిబ్బందిని గణించి నివేదిక రూపొందిస్తోంది. 2021 జనవరి నాటి గణాంకాల ఆధారంగా అధ్యయనం చేసిన బీపీఆర్‌ అండ్‌ డీ... రాష్ట్రంలో మహిళలకు అవసరమైన స్థాయిలో మహిళా పోలీసులు లేరని స్పష్టం చేసింది. అయితే అన్ని రాష్ట్రాలూ మహిళా పోలీసు పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.  

ఉన్న సిబ్బందికీ సమస్యలెన్నో... 
ప్రస్తుతం పోలీసు విభాగంలో ఉన్న మహిళా సిబ్బందిని ఫిట్‌నెస్‌ సమస్యలు వెంటాడుతున్నాయి. చాలా మంది మహిళా పోలీసులు స్థూలకాయంతో బాధపడుతున్నారు. వ్యాయా­యం లేకపోవడం, ఏళ్ల తరబడి కార్యాలయ విధులకే పరిమితం కావడంతో బందోబస్తు డ్యూటీ చేయాల్సి వస్తే నిరసనకారులను అదుపు చేయడం వారికి సాధ్యం కావట్లేదు. కొత్తగా విధుల్లో చేరిన యువ మహిళా సిబ్బంది మినహా మిగిలిన వారిలో అనేక మందికి ఈ సమస్యలు ఉన్నాయి.

మహిళా పోలీసు సిబ్బంది కొరత తీర్చడంతోపాటు ఉన్న వారిలోనూ నైపుణ్యాలు మెరుగుపరచడానికి ఉమ్మడి రాష్ట్రం­లో తెరపైకి వచ్చిన ప్రతిపాదనలు ఇప్ప టికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. మహిళా పోలీసులకు సమకాలీన అంశాలపై అవగాహన కల్పించడం, వృత్తిలో మెళకువలు నేర్పే ఉద్దేశంతో క్రాష్‌కోర్స్‌ నిర్వహించాలని గతంలో భావించారు. అయితే ఈ ప్రక్రియ కొందరికి పూర్తయినా మిగిలిన వారికి ఆగిపోయింది. ప్రత్యేక మహిళా బెటాలియన్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేసినా ఆచరణకి రాలేదు. 

ఎట్టకేలకు లా అండ్‌ ఆర్డర్‌కు నేతృత్వం.. 
హైదరాబాద్‌లోని మూడు కమిషరేట్లలో 150కిపైగా లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుస్టేషన్లు, ఐదు మహిళా ఠాణాలు ఉన్నాయి. మహిళా ఠాణాలకు ఉమెన్‌ ఆఫీసర్లే నేతృత్వం వహిస్తు­న్నా చాలాకాలం వరకు మూడు కమిషనరేట్ల­లో ఏ ఒక్క శాంతి భద్రతల విభాగం పోలీసుస్టేషన్‌కు మహిళా పోలీసును స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ)గా నియమించిన దాఖలాలు లేవు.

అయితే హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గతేడాది మహిళా దినోత్సవం రోజు లాలా­గూడ ఠాణాకు మధులతను మొ­దటి మహిళా ఎస్‌హెచ్‌ఓగా నియమించారు.  మరోవైపు గతంలో మహిళా పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చినా అభ్యర్థి నుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన ఉండేది కాదని... తాజాగా చేపట్టిన పోలీసు రిక్రూట్‌మెంట్‌లో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడంతోపా­టు వారికి అనేక వెసులుబాట్లు కల్పించడంతో పోలీసు విభాగంలో అతివల కొరత చా­లా వరకు తీరుతుందని అధికారులు చెబుతున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)