Breaking News

సర్కారు స్థలాలకు రక్షణ కరువు

Published on Wed, 01/24/2024 - 08:08

సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సర్కారు స్థలాలపై పర్యవేక్షణ కరువైంది. రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం.. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది నిర్వాకంతో ప్రభుత్వ స్థలాలు  హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్రమార్కులు పాగా వేస్తున్నారు. ప్రభుత్వ స్థలం అంటూ సైన్‌ బోర్డులు ఉన్నా.. వాటిని  సైతం తొలగిస్తూ దర్జాగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. ఒత్తిడితో కూడిన ఫిర్యాదులు వస్తే గానీ రెవెన్యూ అధికారులు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ప్ర«భుత్వ స్థలంపై నిర్మించిన అక్రమ కట్టడం సక్రమ కట్టడం జాబితాలో క్రమంగా చేరిపోతున్నా... రెవెన్యూ వ్యవస్థ ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం విస్మయానికి గురి చేస్తోంది. ఒకవేళ రెవెన్యూ అధికారులు అడ్డుకుంటే మాత్రం అక్రమార్కులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. అనేక ఆక్రమిత స్థలాలపై  అవసరమైన ఆధారాలు, సమగ్ర వాదనలు లేక కోర్టులో కేసులు వీగిపోతున్నాయనే విమర్శలూ లేకపోలేదు. 

మొక్కుబడి చర్యలు.. 
గతంలో రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూముల పరిరక్షణకు పలు చర్యలు చేపట్టినా.. క్షేత్ర స్థాయిలో అమలు  మూణ్నాళ్ల ముచ్చటగానే తయారైంది. పలుమార్లు  ప్రభుత్వ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆన్‌లైన్‌ మానిటరింగ్, ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో భద్రపర్చే చర్యలతో పాటు పర్యవేక్షణ బాధ్యత క్షేత్ర స్థాయి సిబ్బందికి అప్పగించారు.  వాస్తవంగా వీఆర్వోలు ప్రతిరోజూ  భూములపై పర్యవేక్షణతో పాటు పక్షం రోజులకు ఒకసారి తనిఖీ చేసి తగిన సమాచారాన్ని సంబంధిత తహసీల్దార్లు, భూ పరిరక్షణ అధికారులకు అందించాలి. కానీ ఆచరణలో అలా చేయడంలేదు. చాలా ప్రాంతాల్లోని  ప్రభుత్వ భూములకు కంచె, పూర్తి స్థలాల్లో సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఆక్రమణలకు గురవుతున్నాయి. కొన్ని స్థలాల ఆక్రమణ విషయంలో రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తూన్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు వెలసిన తర్వాత ఫిర్యాదులు, ఒత్తిడికి వస్తే గానీ స్పందించక పోవడం నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది. 

ల్యాండ్‌ పార్శిల్స్‌..  
హైదరాబాద్‌ జిల్లా రెవెన్యూ పరిధిలో 16 మండలాలు ఉండగా, వాటి పరిధిలో  1075 ల్యాండ్‌ పార్శిల్స్‌లున్నాయి. మొత్తం మీద  890 ల్యాండ్‌ పార్శిల్స్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా 4066914.08 చదరపు గజాల విస్తీర్ణం ఖాళీ స్థలం, మరో 1145334.95 చదరపు గజాల విసీర్ణం ఖాళీ స్థలం ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.  కోర్టు కేసుల్లో  సుమారు 169 పార్శిల్స్‌లోని దాదాపు 1193595.12 చదరపు గజాల ఖాళీ స్థలంతో పాటు 445098.64 చదరపు గజాల ఆక్రమిత భూమి ఉన్నట్లు తెలుస్తోంది. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)