Breaking News

‘మేడిగడ్డ’పై ఇక నివేదికలు అక్కర్లేదు!

Published on Fri, 12/06/2024 - 05:10

సాక్షి, హైదరాబాద్‌: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల కింద ఏర్పడిన బుంగలను తమ సిఫార్సులకు విరుద్ధంగా నీటిపారుదల శాఖ గ్రౌటింగ్‌ ద్వారా పూడ్చేయడంతో భూగర్భంలోని స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన నిపు ణుల కమిటీ వెల్లడించింది. ఇప్పుడు పరీక్షలు నిర్వహించినా బరాజ్‌ల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవ కారణాలను తెలుసుకోలేమని తేల్చిచెప్పింది. అందువల్ల గతంలో తాము మధ్యంతర నివేదికలో నిర్దేశించిన వివిధ పరీక్షలు, అధ్యయనాల జాబితా నుంచి 5 రకాల అధ్యయన నివేదికలను ఇక సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

తాము సూచించిన అధ్యయనాలను సకాలంలో చేపట్టి నివేదికలను సమర్పించడంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ తాత్సారం చేస్తోందని తప్పుబట్టింది. ఈ మేరకు నిపుణుల కమిటీ సభ్య కార్యదర్శి/ఎన్డీఎస్‌ఏ డైరెక్టర్‌ గత నెల 29న ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌కు తన అసంతృప్తిని తెలియజేస్తూ లేఖ రాశారు. ఈ తాత్సారం వల్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ తాము తుది నివేదిక సమర్పించేందుకు మరింత ఆలస్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

 ఇకపై మిగిలిన నివేదికలైనా సకాలంలో సమర్పించేలా తెలంగాణ నీటిపారుదల శాఖపై ఒత్తిడి తేవాలని ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను అయ్యర్‌ ఈ నెల 2న నీటిపారుదల శాఖ కార్యదర్శికి పంపారు. సత్వరమే కోరిన సమాచారాన్ని అందజేయాలని సూచించారు. 

డిసెంబర్‌ 31లోగా తుది నివేదిక అనుమానమే
గత వానాకాలానికి ముందు బరాజ్‌లకు నిర్వహించాల్సిన తాత్కాలిక మరమ్మతులతోపాటు వాటిలోని లోపాలను గుర్తించడానికి చేపట్టాల్సిన జియోఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షలను నిర్దేశిస్తూ ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ ఏప్రిల్‌ 30న మధ్యంతర నివేదికను ఎన్డీఎస్‌ఏకు సమర్పించింది. బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఈ అధ్యయనాలు అత్యవసరమని అప్పట్లో తెలిపింది. అయితే వానాకాలంలోగా నీటిపారుదల శాఖ ఆయా అధ్యయనాలను చేపట్టి నివేదించకపోవడంతో నిపుణుల కమిటీ తుది సిఫార్సుల గడువును అక్టోబర్‌ 31 నుంచి ఎన్డీఎస్‌ఏ డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్‌ 31లోగా తుది నివేదిక సమర్పించే అంశంపై నిపుణుల కమిటీ పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేసింది. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు