Breaking News

150 ఎంబీబీఎస్‌ సీట్లు గోవిందా!

Published on Sat, 07/19/2025 - 05:15

సాక్షి, హైదరాబాద్‌: రెన్యువల్‌ కోసం లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరంగల్‌లోని ఫాదర్‌ కొలంబో మెడికల్‌ కాలేజీ (ఎఫ్‌సీఐఎంఎస్‌)కి ఈ సంవత్సరం ఎంబీబీఎస్‌ అడ్మిషన్లలో షాక్‌ తగిలింది. త్వరలో ప్రారంభం కానున్న ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల జాబితా నుంచి ఈ కళాశాలను జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తొలగించింది.

ఈ కాలేజీలో ఉన్న 150 ఎంబీబీఎస్‌ సీట్లను రెన్యువల్‌ చేయలేదు. దీంతో రాష్ట్రంలో ఈసారి 150 ఎంబీబీఎస్‌ సీట్లు తగ్గనున్నాయి. వైద్య కళాశాల రెన్యువల్‌ కోసం రూ.66 లక్షలు లంచంగా ఇచ్చినట్లు సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగాసీబీఐ నమోదుచేసిన కేసుల ఆధారంగా మొత్తం 3,000 మెడికల్‌ సీట్లను ఎన్‌ఎంసీ ఈసారి రెన్యువల్‌ చేయలేదు. అందులో తెలంగాణ నుంచి ఎఫ్‌సీఐఎంఎస్‌ ఒక్కటే ఉంది. 

రెన్యూవల్‌ కోసం అడ్డదారులు: ఎఫ్‌సీఐఎంఎస్‌ 2023లోనే ప్రారంభమైంది. ఈ కళాశాలకు ట్రస్టీగా ఉన్న ఫాదర్‌ జోసఫ్‌ కొమ్మారెడ్డి.. కళాశాల రెన్యువల్‌ కోసం అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. నకిలీ బోధకులు, అద్దె రోగులతో కళాశాల పరిధిలోని బోధనాసుపత్రిని నింపి అప్పటి అధికారులను మేనేజ్‌ చేశారని ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్‌ బి.హరిప్రసాద్‌ (కదిరి, ఏపీ), డాక్టర్‌ అంకం రాంబాబు (హైదరాబాద్‌), డాక్టర్‌ కృష్ణ కిషోర్‌ (విశాఖపట్నం) ద్వారా రెండు విడతల్లో రూ.66 లక్షలను ఎంసీఐ అధికారులకు లంచంగా ఇచ్చినట్లు సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)