Breaking News

డాక్టర్, మేల్‌ నర్స్‌కు పదేళ్ల జైలు

Published on Sat, 01/24/2026 - 12:13

నిజామాబాద్‌ లీగల్‌: నకిలీ రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లను సరఫరా చేసి, రోగుల ప్రాణాలతో చెలగాటమాడిన మేల్‌ నర్సు, డాక్టర్‌కు నిజామాబాద్‌ ప్రిన్సిపల్‌ డి్రస్టిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి జీవీఎన్‌ భారతలక్ష్మి పదేళ్ల జైలు శిక్ష, చెరో రూ.లక్ష జరిమానా విధించారు. 2021లో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం చేపూర్‌కు చెందిన కొండ్ర మహేశ్‌బాబు కరోనా చికిత్స కోసం ఆర్మూర్‌లోని లైఫ్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ డాక్టర్‌గా పనిచేస్తున్న అల్యాన సాయి కృష్ణ మార్కెట్‌లో ఆ ఇంజెక్షన్ల కొరత ఉండటంతో తానే వాటిని సమకూర్చుతానని పేషెంట్‌ తమ్ముడు రంజిత్‌ వద్ద రూ. 50 వేలు తీసుకొని రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు. 

అయినా మహేశ్‌కు కరోనా తీవ్రత తగ్గలేదు. మెరుగైన చికి త్స కోసం నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్‌ ప్రవీ ణ్‌ పేషెంట్‌కు కోవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల మూడు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు అవసరమని, ఆ ఇంజెక్షన్లను తీసుకురావాల్సిందిగా కోరాడు. అయితే పేషెంట్‌ బంధువు డాక్టర్‌ సాయికృష్ణను సంప్రదించాడు. ధర పెరిగిందని 3 ఇంజెక్షన్లకు రూ.85 వేలు ఇవ్వాలని కోరాడు, అందుకు వారు అంగీకరించడంతో నిజామాబాద్‌లోని తిరుమల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో మేల్‌ నర్స్‌గా పనిచేస్తున్న పులి సతీశ్‌గౌడ్‌తో కలిసి మూడు ఇంజెక్షన్లను రోగి బంధువుకు ఇచ్చారు. 

డాక్టర్‌ ప్రవీణ్‌ వాటిని నకిలీ ఇంజెక్షన్లుగా గుర్తించి తిరిగి వెనక్కి ఇచ్చేశాడు. రెండోసారి కూడా నకిలీ ఇంజెక్షన్లు ఇవ్వడంతో తాము మోసపోయామని గ్రహించిన రోగి సోదరుడు రంజిత్‌కుమార్‌ నిజామాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పులి సతీశ్‌గౌడ్, డాక్టర్‌ సాయికృష్ణపై కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన జడ్జి పైవిధంగా తీర్పు ఇచ్చారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)