Breaking News

నిర్మల్‌: నిరసనల ఎఫెక్ట్.. ఇథనాల్‌ పరిశ్రమ పనులకు బ్రేక్‌

Published on Wed, 11/27/2024 - 14:29

నిర్మల్:  నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాకర్టీ ఏర్పాటుపై స్థానికులు చేపట్టిన ఆందోళనలతో అధికార యంత్రాంగం దిగొచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా తాజాగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో.. ఐదుగురు రైతులను జిల్లా కలెక్టర్ చర్చలకు పిలిచారు. 

దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ పరిశ్రమ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు పరిశీలిస్తోంది. అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది అని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

దాదాపు రెండు రోజులుగా ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకంగా దిలావర్పూర్ గ్రామస్థులు నిరసనల్లో పాల్గొన్నారు.  మంగళవారం ఉదయం నుంచి ఆ నిరసనలు ఉధృతం చేశారు. నిన్న రాత్రి రోడ్డుపైనే వంటలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వారంతా రోడ్డుపైనే భోజనం చేశారు.

ఇవాళ మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరనసల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొందరిని ముందస్తుగా అరెస్ట్ చేయడంతో పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు. పోలీసుల వాహనాలపైకి రాళ్లు విసిరారు. దీంతో, పోలీసులు పరుగులు తీశారు. అనంతరం, అక్కడ ఉద్రిక్తతకర పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వచ్చే వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని గ్రామస్థులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. 

ప్రభుత్వం సీరియస్‌
మరోవైపు.. ఇథనాల్‌ పరిశ్రమ అనుమతులను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇథనాల్‌ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)