Breaking News

ప్రాణం తీసినా భూములివ్వం!

Published on Sun, 11/24/2024 - 04:40

దుద్యాల్‌: తమ ప్రాణాలు తీసినా సరే భూములు మాత్రం కంపెనీల కోసం ఇచ్చేది లేదని వికారాబాద్‌ జిల్లా దుద్యాల్‌ మండలంలోని లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంటతండా ప్రజలు తేల్చి చెప్పారు. శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) అధికారులు ఈ మూడు గ్రామాల్లో పర్యటించారు.

ఢిల్లీ నుంచి వచ్చిన కమిషన్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ లా ముఖేశ్, ఇన్‌స్పెక్టర్లు రోహిత్‌సింగ్, యతి ప్రకాశ్‌శర్మ బాధిత కుటుంబాలను కలిసి అభిప్రాయాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు పోలీసులు తమపట్ల అమానుషంగా వ్యవహరించారని గిరిజన మహిళలు గోడు వెళ్లబోసుకొన్నారు. 

రోటిబండతండాకు చెందిన సోనీబాయి, కిష్టబాయి, జ్యోతి, ప్రమీల, వాల్మీబాయి, జార్పుల రూప్‌సింగ్‌ నాయక్, సీత తదితరులను అధికారులు ప్రశ్నించారు. తమను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, చివరికి ప్రాణాలు తీసినా భూములు మాత్రం ఇవ్వబోమని ఈ సందర్భంగా బాధితులు తేల్చి చెప్పారు. కోర్టుల చుట్టూ తిరిగేందుకు తమ వద్ద డబ్బు లేదని చెప్పగా.. ప్రభుత్వ లీగల్‌ ఎయిడ్‌ ద్వారా ఉచితంగా బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. 

ఈ పర్యటనపై అధికారులు నివేదిక సిద్ధంచేసి కమిషన్‌కు అందజేయనున్నారు. ఈ నెల 11న లగచర్ల ఘటన జరగగా.. బాధిత గిరిజనులు 18న ఢిల్లీకి వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  

ఎన్‌హెచ్‌ఆర్సీ అడిగిన ప్రశ్నలివే.. 
ప్రశ్న: దాడి జరిగిన రాత్రి మీ మీ ఇళ్లలో ఎం జరిగింది? 
జవాబు: కరెంట్‌ తీసి పోలీసులు ఇళ్లలోకి దూరి మగవారిని తీసుకెళ్లారు, ఆడవారిని బెదిరించారు. అడ్డుపడితే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారు. 
ప్రశ్న: పోలీసులు మిమ్మల్ని కొట్టారా? 
జవాబు: కొట్టారు, అసభ్యకరంగా తిట్టారు సార్‌. 
ప్రశ్న: మీ డిమాండ్స్‌ ఏమిటి? 
జవాబు: మా ప్రాంతంలో కంపెనీలు వద్దు. మేము భూములు ఇవ్వం. మా జోలికి రావొద్దు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేసి మా కుటుంబ సభ్యులను విడిచిపెట్టాలి. 

కమిషన్‌ చేసిన సూచనలు..  
ఎఫ్‌ఐఆర్‌లో పేరున్నవారు లొంగిపోతే 14 రోజులు రిమాండ్‌కు పంపి, బెయిల్‌ ఇస్తారు.  ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేనివారు ముందస్తు బెయి ల్‌ కోసం న్యాయస్థానంలో పిటిషన్‌ వేసుకోవాలి. లేదంటే ప్రస్తుతం జైలులో ఉన్నవారికి కూడా బెయిల్‌ రాదు. భూములు, కేసుల వ్యవహారాన్ని న్యాయస్థానాలు చూసుకుంటా యి. గ్రామాల్లోని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు మీ జోలికి రారు.  

నా కొడుకుకు సంబంధం లేదు
నా కొడుకు బాష్యానాయక్‌కు దాడితో ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజంతా మేకలు కాసేందుకు వెళ్లాడని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. అర్ధరాత్రి వచ్చి ఇంటి నుంచి తీసుకెళ్లడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టారు.     – సోనీబాయి, బాధితురాలు

బతిమాలినా వదిలిపెట్టలేదు 
నా భర్త ప్రవీణ్‌ పాల ఆటో నడుపుతాడు. ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు వచ్చి తలుపు తట్టారు. మేము భయపడి తీయకపోవడంతో కాళ్లతో బలంగా తలుపులు తన్నేసి లోపలికి వచ్చారు. ఇంట్లోని బీరువాను పగలగొట్టి చూశారు. నాకు డెలివరీ సమయం ఉందని బతిమాలినా వినకుండా నా భర్తను లాక్కెళ్లారు. పోలీసులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.      – జ్యోతి, బాధితురాలు 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)