ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త వేతనాలు

Published on Sun, 06/02/2024 - 05:16

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త వేతనాల చెల్లింపు మొదలైంది. 2017 నాటి వేతన సవరణకు సంబంధించి గత మార్చిలో ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ ప్రకటించటంతో, ఆ మేరకు కొత్త వేతనాలను జూన్‌ 1న చెల్లించారు. మే నెలకు సంబంధించి వేతనాలు తాజాగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నమోదయ్యాయి. 21 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకారం కొత్త వేతనాలు అందుకోవటంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లోని ఆర్టీసీ ఉద్యోగుల్లో సంబరాలు నెలకొన్నాయి. 

ఏడేళ్ల క్రితం నాటి వేతన పెంపుతో..  
2017లో వేతన సవరణ జరగాల్సి ఉండగా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవటంతో ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను ప్రకటించలేదు. దీంతో కార్మిక సంఘాలు అప్పట్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. వాటితో చర్చించేందుకు నాటి ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. వేతన సవరణ చేయకుంటే సమ్మెను ఆపబోమని కారి్మక సంఘాలు తేల్చి చెప్పటంతో, మధ్యే మార్గంగా 16 శాతం ఇంటీరియమ్‌ రిలీఫ్‌కు కమిటీ ప్రతిపాదించింది. 

ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఫిట్‌మెంట్‌ ఇవ్వనున్నట్టు పేర్కొంది. దీనికి కార్మిక సంఘాలు సమ్మతించి సమ్మెను విరమించాయి. అప్పటినుంచి ఐఆరే కొనసాగుతూ వచ్చింది. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి మార్చిలో 21 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించింది. ఇక అప్పటివరకు ఉన్న 82.6 శాతం కరువు భత్యంలోంచి, 2017 వేతన సవరణ గడువు నాటికి ఉన్న 31.1 శాతాన్ని ఉద్యోగుల మూలవేతనంలో చేర్చారు. 

మిగిలిన కరువు భత్యాన్ని 43.2 శాతానికి న్యూట్రలైజ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా ఆర్టీసీ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను తగ్గించారు. మొత్తంగా కాస్త సంతృప్తికరంగానే ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. ఏడేళ్ల క్రితం నాటి వేతన పెంపు అమలులోకి రావటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  బకాయిలు మాత్రం ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తామనటంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

రూ. 360 కోట్ల భారం 
ఈ వేతన సవరణతో ఆరీ్టసీపై సాలీనా రూ.360 కోట్ల భారం పడనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవటంతో, రోజువారీ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు సంస్థ ప్రత్యేక కసరత్తు నిర్వహిస్తోంది. ఇది కొంతవరకు సత్ఫలితాలనిస్తోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)