Breaking News

3 చేపల కథ!

Published on Sun, 11/24/2024 - 05:44

సాక్షి, హైదరాబాద్‌: ఏడు చేపల కథ తెలుసుగానీ ఈ మూడు చేపల కథ ఏంటి కొత్తగా అనుకుంటున్నారా? ముందుగా రాష్ట్రంలోని అమ్రాబాద్‌తోపాటు కల్సుబాయి, రాధానగరి పేర్లు విన్నారా? అవి దేశంలోని ప్రముఖ అభయారణ్యాలు. ఈ అభయారణ్యాల్లోని నీటిపాయల్లో తాజాగా మూడు రకాల చేపల జాతులను జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ) గుర్తించింది. ఈ చేపల రకాలు ఇండోరియోనెక్టెస్‌ జాతికి చెందినప్పటికీ కాస్త వేర్వేరు లక్షణాలు కలిగి ఉండటంతో వాటికి మూడు వేర్వేరు పేర్లు పెట్టారు. అందులో మొదటి రకం చేపను తెలంగాణలోని అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో గుర్తించారు.

అందుకే దానికి ఇండోరియెనెక్టెస్‌ ఆమ్రాబాద్‌ అని పేరు పెట్టారు. ఇది అక్కడ మాత్రమే జీవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక రెండో రకం చేప జాతిని మహారాష్ట్రలోని పశి్చమ కనుమలలో ఉన్న కల్సుబాయి అభయారణ్యంలో గుర్తించిన సైంటిస్టులు.. దానికి ఇండోరియెనెక్టెస్‌ కల్సుబాయిగా నామకరణం చేశారు. మూడో రకం చేప జాతిని మహారాష్ట్రలోని రాధానగరి అభయారణ్యంలోని ఓ నదీ ప్రవాహంలో గుర్తించారు. దీనికి ఇండోరియోనెక్టెస్‌ రాధానగరిగా పేరుపెట్టారు.

ఇండోరియోనెక్టెస్‌ వర్గానికి చెందిన చేపలు చాలా వరకు గోదావరి, కృష్ణా, కావేరి నదీ వ్యవస్థల్లో ఎక్కువగా కనిపిస్తాయని శాస్త్రవేత్త శ్రీకాంత్‌ జాదవ్‌ వివరించారు. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళలలో ఇవి ఎక్కువగా ఉంటాయని తెలిపారు. తెలంగాణలో తొలిసారిగా 2020లో ఇదే వర్గానికి చెందిన ఇండోరియోనెక్టెస్‌ తెలంగాణెన్సిస్‌ను కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో కనుగొన్నారు. ఇప్పటివరకు ఈ రకానికి చెందిన ఆరు జాతుల చేపలను శాస్త్రవేత్తలు గుర్తించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)