Breaking News

ఆర్టీసీలో కొత్తగా సెమీ డీలక్స్‌ బస్సులు

Published on Mon, 04/15/2024 - 02:52

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్టీసీ కొత్తగా మరో కేటగిరీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్‌– డీలక్స్‌ కేటగిరీల మధ్య.. సెమీ డీలక్స్‌ పేరుతో వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. తద్వారా టికెట్ల ఆదాయం కాస్త పెరుగుతుందని, సిబ్బందికి వేతన సవరణతో పెరిగే భారం పూడుతుందని భావిస్తోంది. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇటీవల ఆరు బృందాలతో రెండు దఫాలుగా మేధోమథనం నిర్వహించి, సూచనలను స్వీకరించింది. అందులోంచి ముఖ్యమైన, అమలు చేయదగిన వాటిని గుర్తించింది. సెమీ డీలక్స్‌ సర్వీసు కూడా అందులో ఉన్నట్టు సమాచారం.

వేతన సవరణ భారంతో..
ఆర్టీసీ సిబ్బందికి రెండు వేతన సవరణ (పీఆర్సీ)లు బకాయి ఉంది. అందులో ఒకదాన్ని అమలు చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌ను కూడా ప్రకటించింది. వచ్చే నెల నుంచే ఇది అమల్లోకి రానుంది. సంస్థపై రోజుకు రూ.కోటి వరకు వేతన భారం అదనంగా పెరగనుంది. దీనితో ఆ మేర ఆదాయాన్ని పెంచుకోవడంపై ఆర్టీసీ దృష్టి సారించింది.

ఎక్స్‌ప్రెస్‌ల కంటే కాస్త ఎక్కువగా..
ప్రస్తుతం ఆర్టీసీలో బాగా డిమాండ్‌ ఉన్న కేటగిరీ.. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు. మిగతా కేటగిరీ బస్సుల కంటే వీటి సంఖ్య ఎక్కువ. దీనిపై ఉన్న డీలక్స్‌ సర్వీస్‌ బస్సుల సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు ఈ రెండు కేటగిరీల మధ్య సెమీ డీలక్స్‌ పేరుతో కొత్త కేటగిరీ ప్రారంభించాలన్నది ఆలోచన. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల కంటే కొంత ఎక్కువ చార్జీతో టికెట్‌ ధరలు ఖరారు చేయాలని భావిస్తున్నారు.

తక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్న బస్సులను గుర్తించి.. వాటిని ఈ కొత్త కేటగిరీకి తగ్గట్టుగా మార్చి నడుపుతారు. దీనితో రోజువారీ టికెట్‌ ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో పోలిస్తే.. మరికొంత దూర ప్రాంతాలకు వీటిని తిప్పుతారని.. సీట్లు కూడా కాస్త మెరుగ్గా పుష్‌బ్యాక్‌ తరహాలో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి.

మహాలక్ష్మితో తగ్గిన టికెట్‌ వసూళ్లు
రాష్ట్రంలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీకి నేరుగా వసూలయ్యే టికెట్‌ ఆదాయం భారీగా తగ్గింది. సంస్థకు టికెట్ల ద్వారా రోజుకు రూ.16 కోట్ల వరకు సమకూరే ఆదాయం.. రూ.పదిన్నర కోట్లకు పడిపోయింది. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. కానీ ఇంకా ప్రభుత్వం నుంచి ఈ నిధుల విడుదల మొదలుకాలేదు. దీనితో టికెట్‌ ఆదాయం పెంపుపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. 

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)