Breaking News

యాజమాన్య కోటా.. ఇక ఆన్‌లైన్‌!

Published on Wed, 12/04/2024 - 04:41

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ సీట్లను ఇప్పటివరకు ఏ కాలేజీకి ఆ కాలేజీ సొంతంగా భర్తీ చేసుకునేవి. ఈ సీట్లను కూడా మెరిట్‌ ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉన్నా.. ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే అమ్ముకుంటు న్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మేనేజ్‌మెంట్‌ కోటా భర్తీలోనూ పారదర్శకతను తీసుకొచి్చ, మెరిట్‌ విద్యార్థులకు మేలు చేసేందుకు ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేసేందుకు ఉన్న అవకాశాలపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిని ప్రభుత్వం కోరింది. దీనిపై మండలి చేపట్టిన కసరత్తు తుది దశకు చేరిందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ నివేదికలో మండలి కొన్ని కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిసింది.  

పారదర్శకత కోసమే.. 
రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం సీట్లను కన్వినర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ కోటాలో సీటు పొందిన వారిలో అర్హులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ వస్తుంది. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’కేటగిరీ కింద భర్తీ చేస్తారు. మిగిలినవి ఎన్‌ఆర్‌ఐల పిల్లలకు కేటాయించారు. యాజమాన్య కోటాలో సీటు పొందిన విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు. 

జేఈఈ, టీజీఈఏపీ ర్యాంకు ఆధారంగా, ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు వచ్చిన వారికే ఈ సీట్లు ఇవ్వాలి. ఇక సీ కేటగిరీ కింద ఎన్‌ఆర్‌ఐల పిల్లలకు సీట్లు కేటాయించాలి. అయితే, మెరిట్‌ లేకున్నా ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే మేనేజ్‌మెంట్‌ సీట్లు అమ్ముకొంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. నిజానికి కనీ్వనర్‌ కోటాలో ఫీజు రూ.లక్ష ఉంటే.. మేనేజ్‌మెంట్‌ కోటాలోని బీ కేటగిరీ సీటుకు మూడింతలు.. అంటే రూ.3 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు ఐదింతలు.. అంటే రూ.5 లక్షల వరకు మాత్రమే ఫీజు తీసుకోవాలి. 

కానీ.. మేనేజ్‌మెంట్‌ కోటాలో కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లను కాలేజీలు రూ.8 నుంచి రూ.16 లక్షల వరకు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అంత ఫీజు చెల్లించలేని మెరిట్‌ విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ సీట్లు ఎవరికి, ఎంతకు అమ్ముకొంటున్నారన్న వివరాలు కూడా బయటపెట్టకపోవటంతో ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ సీట్లను భర్తీ చేయటం వల్ల నిర్ణీత ఫీజు చెల్లిస్తే మెరిట్‌ విద్యార్థులకే సీట్లు లభిస్తాయని, సీట్ల భర్తీ అంతా పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.  

ఇవీ ప్రతిపాదనలు... 
»   బీ, సీ కేటగిరీ సీట్లకు ప్రభుత్వమే ఫీజులు ప్రతిపాదిస్తుంది. కనీ్వనర్‌ కోటాకన్నా బీ కేటగిరీకి మూడు రెట్లు, సీ కేటగిరీ సీట్లకు ఐదురెట్లు అధికంగా ఫీజులు వసూలు చేయవచ్చు. దీంతో పాటు లే»ొరేటరీలు, లైబ్రరీ ఫీజులు అదనంగా వసూలు చేసుకునే అధికారం ఇవ్వాలనే సూచన చేయనున్నట్లు సమాచారం.  

»   ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి నీట్‌ అనుసరిస్తున్న విధానాన్నే ఇంజనీరింగ్‌లోనూ అనుసరించాలనే మరో ప్రతిపాదన చేస్తున్నారు. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో భర్తీ చేసే ఈ ప్రక్రియ మొత్తం కనీ్వనర్‌ కోటా మాదిరిగా సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఫీజులు మాత్రం కాలేజీలే నిర్ణయిస్తాయని అధికారులు అంటున్నారు.   

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)