Breaking News

హైదరాబాద్‌లో కొత్త పోలీస్ కమిషనరేట్‌లు.. నలుగురు ఐపీఎస్‌ల బదిలీ

Published on Mon, 12/29/2025 - 23:28

సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్‌లను పునర్ వ్యవస్థీకరించి నాలుగు కమిషనరేట్‌లుగా విస్తరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి (రాచకొండ కమిషనరేట్ స్థానంలో) , ఫ్యూచర్ సిటీ ఇలా నాలుగు ప్రాంతాల్లో నాలుగు కమిషనరేట్లను ప్రభుత్వం విస్తరించనుంది. ఈ మేరకు నలుగురు ఐపీఎస్‌ ఆఫీసర్‌లను బదిలీ చేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి-భువనగిరి ప్రాంతాన్ని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి జిల్లాకు ప్రత్యేకంగా ఎస్పీని నియమించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణ నేపథ్యంలో ఈ మార్పులు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  

కమిషనరేట్‌ల పరిధులు
-హైదరాబాద్ కమిషనరేట్: అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, బుద్వేల్ హైకోర్టు వంటి కీలక ప్రాంతాలు.  
- సైబరాబాద్ కమిషనరేట్: గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పఠాన్‌చెరు, జీనోమ్ వ్యాలీ, RC పురం, అమీన్‌పూర్ వంటి ఐటీ , పారిశ్రామిక ప్రాంతాలు.  
- మల్కాజిగిరి కమిషనరేట్: కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు.  
- ఫ్యూచర్ సిటీ కమిషనరేట్: చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు.  

కొత్త నియామకాలు  
1. సుధీర్ బాబు, ఐపీఎస్‌: రాచకొండ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీరిని, కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ (Future City) పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
2. అవినాష్ మొహంతి, ఐపీఎస్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఐపీఎస్‌ ఆఫీసర్‌ అవినాష్ మొహంతిను రాచకొండ కమిషనరేట్‌ను పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేసిన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
3. డా. ఎం. రమేష్, ఐపీఎస్: ఐజీపీ (ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్) గా ఉన్న ఐపీఎస్‌ ఆఫీసర్‌ రమేష్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
4. అక్షంష్ యాదవ్, ఐపీఎస్: యాదాద్రి భువనగిరి డీసీపీగా ఉన్న ఐపీఎస్‌ ఆఫీసర్‌ అక్షంష్‌ను నూతనంగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా (SP) నియమించారు. 

నాలుగు కమిషనరేట్‌లకు పోలీస్ కమిషనర్లను, యాదాద్రి-భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు