Breaking News

బాధితులకు భరోసా.. 

Published on Sun, 07/16/2023 - 02:54

సాక్షి, హైదరాబాద్‌: ఎవరు అవునన్నా, కాదన్నా.. పురుషాధిక్య సమాజంలో మహిళలంటే చిన్నచూపే. లైంగిక దాడికి గురైన బాధితులంటే మరీనూ. బయటికొస్తే చాలు అవమానపు మాటలు, అనుమానపు చూపు­లతో బతకడమే వృథా అనే పరిస్థితులను అధిగమించి.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే ఎంతో మనోధైర్యం, భరోసా అవసరం.

ఇలాంటివారి జీవితాల్లో వసంతాన్ని నింపేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం సరికొత్త కార్యక్రమానికి ప్రణాళిక రచిస్తోంది. బాధిత మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఇంక్యుబేటర్‌ వీ–హబ్‌తో చేతులు కలిపింది. బాధిత మహిళలకు జీవనోపాధికి అవసరమైన ఆర్ధిక భరోసా, సాంత్వన అందించనుంది. 

ఎంపిక ఎలా? ఎలాంటి వ్యాపారాలు? 
మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నడు­స్తున్న భరోసా కేంద్రాల ద్వారా లైంగిక దాడికి గురైన బాధితులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పథకాలు గురించి వారికి అవగాహన కల్పిస్తారు.

సొంతంగా వ్యాపారం, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఆసక్తి, నైపుణ్యం ఉంటే.. వారితో మాట్లాడి, ఆలోచనలకు కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. వారి ఆర్ధిక వనరుల గురించి అధ్యయనం చేసి, చేయూతనిస్తారు. స్వీ­ట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, బేకరి ఉత్పత్తులు వంటి తినుబండారాల వ్యాపారం, బ్యూటీ­పార్లర్, కుట్లు అల్లికలు, జ్యువెలరీ తయారీ వంటి చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేందుకు సహకరిస్తారు. 

వందకు పైగా బాధితులకు శిక్షణ.. 
తొలి దశలో మేడ్చల్, వరంగల్‌ వంటి ఏడు జిల్లాల నుంచి వందకు పైగా బాధిత మహిళలను ఎంపిక చేసినట్లు తెలిసింది. తొలి సెషన్‌లో బాధితులు, వారి కుటుంబ సభ్యులతో చర్చించి, వారి వ్యాపార ఆలోచనల గురించి తెలుసుకున్నామని, ఆయా వ్యాపార అవకాశాలపై వారికి అవగాహన కల్పిచామని వీ–హబ్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. త్వరలో రెండో సెషన్‌ నిర్వహించి, ఎవరు ఏ కేటగిరీ వ్యాపారాలకు సెట్‌ అవుతారో అధ్యయనం చేసి, ఎంపిక చేస్తామన్నారు. 

వీ–హబ్‌ ఏం చేస్తుందంటే? 
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎదుర­య్యే ప్రధాన ఇబ్బంది గుర్తింపు లేకపోవటమే. బాధిత ఎంటర్‌ప్రెన్యూర్లకు ఆ ఇబ్బంది ఉండదు. ఏ తరహా వ్యాపారానికి ఎలాంటి లైసెన్స్‌లు అవసరం దగ్గరి నుంచి డాక్యుమెంటేషన్, మార్కెటింగ్, పథకాలు, ఆర్ధిక వనరుల వరకూ అన్ని వైపుల నుంచి సహా­యస­హకారాలు అందిస్తారు. వీ–హబ్‌ మెంటార్‌షిప్‌తో పాటు క్రెడిట్‌ లింకేజ్‌ కోసం రు­ణ దాతలు, రుణ గ్రహీతలను కలుపుతారు. 

ప్రాథమిక దశలో ఉంది.. 
మహిళల భద్రతే షీ టీమ్స్, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ తొలి ప్రాధాన్యం. లైంగిక దాడి బాధితులకు కావాల్సిన సహాయం చేసేందుకు నిత్యం సిద్ధంగా ఉంటాం. బాధిత మహిళలకు అండగా నిలవడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది.       – శిఖా గోయల్, అదనపు డీజీ, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)