Breaking News

హెచ్‌ఐవీ నియంత్రణకు కొత్త ఔషధాలు

Published on Fri, 12/15/2023 - 04:58

సాక్షి, హైదరాబాద్‌:  హెచ్‌ఐవీని నియంత్రించేందుకు కొత్త ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని, వ్యాధి బారినపడిన వారికి వీటితో మంచి ఫలితం ఉంటుందని ప్రముఖ సంక్రమిక వ్యాధుల నిపుణులు డాక్టర్‌ మోనాలిసా సాహు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఇంటిగ్రేస్‌ స్ట్రాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఇన్‌హిబిటర్స్‌ (ఐఎన్‌ఎస్‌టీఐ)’ ఔషధాలు బాధితుల శరీరంలో హెచ్‌ఐవీ వైరస్‌ స్థాయిలను గణనీయంగా తగ్గించాయని వివరించారు.

ఈ ఐఎన్‌ఎస్‌టీఐ, డోలుటెగ్రావిర్‌ వంటివి వైరస్‌ను అణచివేస్తాయని తెలిపారు. మన దేశంలో 24 లక్షల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారని, బాధితుల సంఖ్యలో భారత్‌ ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

గుర్తింపు, చికిత్సలో సవాళ్లు.. 
2021లో విడుదలైన నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నివేదిక ప్రకారం.. దేశంలో హెచ్‌ఐవీ ఏటా 62 వేల మందికి సోకుతోందని డాక్టర్‌ మోనాలిసా సాహు తెలిపారు. ఎయిడ్స్‌ సంబంధిత మరణాల సంఖ్యను 2021లో 41,000గా అంచనా వేశారన్నారు.  డోలుటెగ్రావిర్‌ను కలిగిన కొత్త అధునాతన ఐఎన్‌ఎస్‌టీఐ ఆధారిత ఔషధాలు హెచ్‌ఐవీ చికిత్సలో మంచి ఫలితాలను చూపుతున్నాయని తెలిపారు. కొత్త చికిత్స అవకాశాలు రోగులకు సౌకర్యవంతంగా ఉంటాయని, ఖర్చు కూడా తగ్గుతుందని వైరాలజిస్ట్‌ మేకా సత్యనారాయణ తెలిపారు.  

#

Tags : 1

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు