Breaking News

నీట్‌ యూజీ దరఖాస్తుల స్వీకరణ షురూ

Published on Mon, 02/09/2026 - 06:01

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ సహా ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌–యూజీ)– 2026 షెడ్యూల్‌ విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎనీ్టఏ) ఆదివారం విడుదల చేసింది. ఆదివారం నుంచే ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. విద్యార్థులు మార్చి 8వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదే రోజు రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. మార్చి 10 నుంచి 12 వరకు దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకోవచ్చు.

జనరల్‌ కేటగిరీ రూ.1,700, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు రూ.1,600, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.1,000 పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎన్నారైలు రూ.9,500 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని ఎన్టీఏ వెల్లడించింది. నీట్‌ యూజీ పరీక్షలను మే 3న నిర్వహించనున్నట్లు తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.  https://nta.ac.in, https://neet.nta.nic.in వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. సిటీ ఇన్ఫర్మేషన్‌ స్లిప్‌ (ఏ పట్టణంలో పరీక్ష రాయనున్నారో), అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్, ఫలితాల వెల్లడి వంటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామంది.

నీట్‌ పరీక్షను ఆఫ్‌లైన్‌లో పెన్, పేపర్‌ పద్ధతిలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలన్న ప్రతిపాదనలు వచ్చినా జాతీయంగా 25 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశముండటంతో ప్రస్తుతానికి ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసే విద్యార్థుల సౌలభ్యం కోసం ఎన్టీఏ హెల్ప్‌డెస్‌్కను ఏర్పాటు చేసింది. విద్యార్థులు 011–40759000, 011–69227700 లేదా neetus2026@nta. ac.in ఈమెయిల్‌ను సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)