Breaking News

తుది దశకు నీట్‌–పీజీ అడ్మిషన్లు

Published on Thu, 01/09/2025 - 04:40

సాక్షి, హైదరాబాద్‌: పీజీ వైద్యవిద్యలో ప్రవేశాల ప్రక్రియ తుది దశకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర కోటా ప్రవేశాల కోసం రెండు దశల్లో విడుదలైన అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. తాజాగా కేంద్రం పీజీ అడ్మిషన్లకు కటాఫ్‌ తగ్గించటంతో అందుకు తగ్గట్లుగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో కలిపి రాష్ట్ర కోటా కింద 1,350 పీజీ సీట్లు ఉన్నాయి. 

కటాఫ్‌ తగ్గించడంతో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. పీజీ ప్రవేశాలకు అర్హత సాధించాలంటే ఇప్పటివరకు జనరల్‌ విద్యార్థులు 50 శాతం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు 40 శాతం పర్సంటైల్‌ సాధించాలనే నిబంధన ఉంది. దీనివల్ల చాలా వర్సిటీలలో పీజీ సీట్లు మిగిలిపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కటాఫ్‌ పర్సంటైల్‌ను జనరల్‌కు 15 శాతం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 10 శాతంగా నిర్ణయించింది. 

తగ్గిన కటాఫ్‌ ప్రాతిపదికన మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బుధవారం (8వ తేదీ) సాయంత్రం ఐదు గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజి్రస్టేషన్‌ చేసుకోవాలని కోరింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్‌ జాబితాను విడుదల చేస్తుంది. తదనుగుణంగా వెబ్‌ ఆప్షన్లకు మరో నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. 

ఇన్‌సర్వీస్‌ వైద్యులకు నిరాశే 
స్థానికతపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జరగాల్సిన వాదనలు 15 తేదీకి వాయిదా పడ్డాయి. దీంతో తెలంగాణ ఇన్‌ సర్వీస్‌ డాక్టర్లకు నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో ఇన్‌సర్వీస్‌ కోటా కింద 297 సీట్లు ఉండగా , ఇప్పటివరకు 17 మంది మాత్రమే పీజీలో చేరారు. 

కటాఫ్‌ తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఇచ్చిన నోటిఫికేషన్‌ దరఖాస్తులకు ఈ నెల 11 చివరి తేదీగా నిర్ణయించటంతో.. కేసు విచారణకు ముందే ఇన్‌ సర్వీస్‌ కోటా సీట్ల భర్తీ కూడా పూర్తవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)