Breaking News

‘సరస్వతి’ షేర్ల బదిలీ చెల్లదు

Published on Wed, 07/30/2025 - 05:58

సాక్షి, హైదరాబాద్‌: సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన షేర్ల బదిలీ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వాదనలతో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఏకీభవించింది. తన పేరిట, వైఎస్‌ భారతి పేరిట సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌లో ఉన్న షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని, తమ అనుమతి లేకుండా, షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లపై తమ సంతకాలు లేకుండా చేసుకున్న ఆ బదిలీ చెల్లదని, దాన్ని నిలిపివేయాలని అభ్యర్థిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను బెంచ్‌ అనుమతించింది. 

ఆ షేర్ల ట్రాన్స్‌ఫర్‌ చెల్లదంటూ... షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ మంగళవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. సరస్వతి కంపెనీలోని తమ షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఎన్‌సీఎల్‌టీలో 2024, సెపె్టంబర్‌ 3న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. కనీసం తమ సంతకాలు లేకుండా, ఒరిజినల్‌ షేర్‌ సర్టిఫికెట్లు లేకుండా బదిలీ జరిగిందని చెప్పారు. దీన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వాలని ట్రిబ్యునల్‌ను కోరారు. 

ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల తరఫునా సుదీర్ఘ వాదనలు విన్న రాజీవ్‌ భరద్వాజ్‌ (జ్యుడిషియల్‌), సంజయ్‌ పూరి (టెక్నికల్‌) సభ్యుల ధర్మాసనం ఈ నెల 15న తీర్పు రిజర్వు చేసి... మంగళవారం తుది ఉత్తర్వులు వెలువరించింది. పూర్తి జడ్జిమెంట్‌ వివరాలను నేడు అప్‌లోడ్‌ చేసే అవకాశం ఉంది. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు