Breaking News

గంజాయి రవాణాకు అడ్డుకట్ట!

Published on Mon, 09/29/2025 - 04:17

సాక్షి, హైదరాబాద్‌: గంజాయి మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. స్థానిక పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు విభాగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంత నిఘా పెడుతున్నా ఈ ముఠాలు వారి కళ్లు గప్పి గంజాయి రవాణా చేస్తూనే ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దుతోపాటు ఒడిశా ఏజెన్సీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు నుంచి వస్తున్న గంజాయి రోడ్డు మార్గంలో తెలంగాణ మీదుగా గోవా, బెంగళూరు, ముంబయితోపాటు ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాలకు లారీలు, ట్రావెల్స్, క్యాబ్‌లలో తరలిస్తున్నారు.

అయితే రోడ్డు మార్గాన గంజాయి తరలిస్తుంటే స్థానిక పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు నిఘా పెంచడంతో రైలు మార్గాన్ని ఈ ముఠాలు ఎంచుకుంటున్నాయి. విశాఖ ఏజెన్సీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు దీనిపై ఫోకస్‌ పెంచారు. రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్న సప్లై ఛైన్‌కు అడ్డుకట్ట వేసేలా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌), నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

ఇటీవల ఆర్‌పీఎఫ్‌ డీజీ సోనాలి మిశ్రాతో ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌ అనురాగ్‌ గార్గ్‌ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బందితో కలిసి ఎన్‌సీబీ సంయుక్త దాడులు నిర్వహించాలని నిర్ణయించింది. 2047 నాటికి డ్రగ్‌ ఫ్రీ ఇండియానే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.  

మత్తు పదార్థాలు గుర్తించేందుకు జాగిలాల వినియోగం  
రైళ్లలో రవాణా అవుతున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు అవసరం మేరకు జాగిలాలను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ముఠాలు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ గంజాయి వాసన బయటకు పొక్కకుండా జాగ్రత్తగా సీల్‌ చేసిన ప్యాకెట్లను తమ వద్ద పనిచేసే డీలర్లకు ఇచ్చి ఏసీ కోచ్‌లలో రవాణా చేయిస్తున్నట్టుగా కూడా అధికారులు ఇటీవల కొన్ని కేసుల్లో గుర్తించారు. కొన్నిసార్లు ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన మహిళలకు కొంత కమీషన్‌ ఇచ్చి వారి లగేజీ బ్యాగులలో దుస్తుల మధ్య ప్యాకెట్లు దాచి రాష్ట్రా లు దాటిస్తున్నారు.

ఈ తరహాలో జరుగుతున్న గంజాయి కట్టడికి ఆకస్మిక తనిఖీలు, ఇన్‌ఫార్మర్ల ద్వారా సమాచారంతో దాడులు నిర్వహించే వ్యూహాలు అధికారులు సిద్ధం చేసుకుంటున్నారు. గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థాల వాడకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అవగాహన కలి్పంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రైల్వే స్టేషన్లు, రైళ్లలోని ఎలక్ట్రానిక్‌ బోర్డులలో సూచనలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా గంజాయి రవాణా అవుతున్న మార్గాలు, రైల్వే స్టేషన్లకు సంబంధించిన సమాచార వినిమయం కోసం ఉమ్మడిగా బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.    

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)