Breaking News

అన్నారం బ్యారేజీని పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం

Published on Tue, 02/20/2024 - 10:20

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం నేడు(మంగళవారం) రాష్ట్రానికి చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం(సరస్వతీ) బ్యారేజీలను ఎన్‌డీఎస్‌ఏ అధికారులు పరిశీలించారు. ముందుగా అన్నారం బ్యారేజీలోని 39వ పియర్‌ వద్ద ఏర్పడిన సీపేజీ పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్‌ బ్లాక్‌ 7లో కుంగిన ప్రాంతాన్ని వీక్షించారు. నది గర్భంలో బ్యారేజీ కిందకు వెళ్లి ఇరువైపు ఏర్పడిన పగుళ్లను పరిశీలించారు. 

కాగా బ్యారేజీలో వాటర్ లీకేజీ విషయాన్ని ఇంజనీర్లు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దృష్టికి తీసుకెళ్లగా.. మూడు బ్యారేజిల్లో నీళ్ల స్టోరేజి అంశాన్ని ఎన్‌డీఎస్‌ఏకు ప్రభుత్వం అప్పగించింది. ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చే నివేదికతోనే మరమ్మత్తులు చేయాలా వద్దా అనే అంశంపై  కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకోనుంది. మరమత్తుల కోసం అన్నారం బ్యారేజీలో ఇప్పటికే స్టోరేజ్ వాటర్ రిలీజ్ చేయాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించిన క్రమంలో రాత్రికి రాత్రే గేట్లు తెరిచి నీటిని పూర్తిగా విడుదల చేశారు అధికారులు. బ్యారేజీలో నిలువ ఉన్న మొత్తం 2.5 టీఎంసీల నీటిని కిందికి వదిలారు. ఇక అన్నారం నీళ్లు వదలడంతో  మేడిగడ్డ దగ్గర పనులు ఆగిపోయాయి. 

కాగా ఈ బ్యారేజీలోపలుమార్లు సీపేజ్‌లు ఏర్పడగా.. ఆప్కాన్స్‌ సంస్థ ఇప్పటికే కెమికల్‌ గ్రౌటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మరోచోట చిన్న చిన్న సీపేజ్‌లు కనిపిస్తున్నాయి. దీంతో సీపేజ్‌లకు పూర్తిస్థాయి ట్రీట్‌మెంట్‌ చేయడంతోపాటు బ్యారేజీలోని లోపాలను కనుగొనేందుకు ప్రభుత్వం పార్సన్‌ సంస్థకు ఇన్వెస్టిగేషన్‌ బాధ్యతలను అప్పగించింది.

అయితే నీటిని పూర్తిగా ఖాళీ చేయడంతో బ్యారేజీ పొడవునా 1.6 కిలోమీటర్ల దూరం వరకు లక్ష క్యూబిక్‌ మీటర్ల మేర గేట్ల వద్ద అర మీటరు ఎత్తులో ఇసుక పేరుకుంది. దీంతో బ్యారేజీలో సమగ్ర సర్వే చేసేందుకు వీలవుతుందా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక తీయకపోతే ఫౌండేషన్, పియర్, ర్యాప్ట్‌ల కింద ఖాళీ ప్రాంతం ఎక్కడ ఎంత మేర ఉందనేది తెలియదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇసుక తొలగించిన తరువాతనే సీపేజీ లీకేజీపై విశ్లేషణ సాధ్యం అవుతుందని అంటున్నారు. గేట్లు కూడా పాడైపోయినట్లు సమాచారం. 
చదవండి: HYD: పంటి చికిత్స కోసం వెళితే ప్రాణం పోయింది..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)