Breaking News

భయం గుప్పిట్లోనే లగచర్ల!

Published on Fri, 11/15/2024 - 05:51

వికారాబాద్‌/ పరిగి: లగచర్ల ఘటనతో వికారాబాద్‌ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. రోటిబండతండా, పులిచర్లకుంటతండా, లగచర్ల గ్రామాల గిరిజనులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. అధికారులపై దాడి ఘటన అనంతరం ఆయా గ్రామాలకు చెందిన చాలా మంది భయంతో ఊర్లు వదిలి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం ఆఫ్‌ చేసిన మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలను గురువారం పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు.  

తమవారు ఏమైపోయారో తెలియక.. 
లగచర్ల సహా ఫార్మా విలేజ్‌ ప్రభావిత గ్రామాల ప్రజల్లో కొందరు వారి పనులు చేసుకుంటుండగా.. పరారీలో ఉన్నవారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, పోలీసులకు దొరికిపోయారో ఏమీ తెలియక కన్నీళ్లు పెడుతున్నారు. ఇళ్లలో మగవారంతా వెళ్లిపోవడంతో.. వ్యవసాయ పనులు ఆగిపోయాయని, రెక్కాడితే కానీ పూట గడవని తమకు నిద్రాహారాలు కరువయ్యాయని వాపోతున్నారు. ఈ గ్రామాల్లో అధికారులపై దాడి ఘటన అంశంపై ఎవరిని పలకరించినా మాట్లాడేందుకు జంకుతున్నారు.

మాట్లాడితే పోలీసులు, అధికారులు తమ ను టార్గెట్‌ చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులపై దాడిని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నవారు గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మరోవైపు ఫార్మా విలేజీ భూసేకరణకు సంబంధించి ‘‘అధికారులను తరిమికొడదాం.. నేను, బీఆర్‌ఎస్‌ పార్టీ మీ వెంటే ఉంటాం. ఏం జరిగినా చూసుకుంటాం.. కేటీఆర్‌ కూడా మీకు అండగా ఉంటారు. భూములు జోలికి వస్తే దాడులు చేయటానికి కూడా వెనకాడొద్దు’’అంటూ కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని గతంలో మాట్లాడిన వీడియో గురువారం వైరల్‌గా మారింది.

ఘటనపై ఏడీజీ సమీక్ష 
లగచర్ల ఘటన, తర్వాతి పరిణామాలపై అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏడీజీ) మహేశ్‌ భగవత్‌ సమీక్షించారు. పరిగి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణరెడ్డి, డీఎస్పీలు కరుణాసాగర్, ఇతర పోలీసు అధికారులతో.. ఘటన పూర్వాపరాలపై చర్చించినట్టు తెలిసింది. 120 మంది వరకు దాడి ఘటనలో పాల్గొ న్నట్లు భావిస్తున్న పోలీసులు ఇప్పటికే 21 మందిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం జరుపుతున్న గాలింపు.. ఫార్మా విలేజీ ప్రభావి త గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించినట్టు సమాచారం. భవిష్యత్‌లో ఇలాంటివి చోటు చే సుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)