Breaking News

అల్లు అర్జున్‌​ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

Published on Mon, 12/30/2024 - 08:42

సాక్షి, హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. జనవరి మూడో తేదీకి తీర్పును వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఇక, ఈరోజు అల్లు అర్జున్‌ రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. 

పుష్ప-2 బెనిఫిట్‌ షో సమయంలో సంధ్య థియేటర్‌ వద్ద రేవతి మృతిచెందిన కేసులో అల్లు అర్జున్‌ రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్బంగా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి. ఇదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోరిన పబ్లిక్ ప్రాసిక్యూషన్. ఈరోజు ఇరు వర్గాల వాదనల అనంతరం, తీర్పును వచ్చే నెల మూడో తేదీకి కోర్టు వాయిదా వేసింది. 

అల్లు అర్జున్‌ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు..

  • సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదు..
  • రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు వర్తించదు..
  • బీఎన్‌ఎస్‌ సెక్షన్ 105 అల్లు అర్జున్‌కు వర్తించదు.
  • ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర ఇచ్చింది.
  • రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలి.


పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు..

  • రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణం..
  • అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగింది..
  • ఆయనకు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తాడు..
  • బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు సహకరించడు..
  • అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి.
     

ఇక, సంధ్యా థియేటర్‌ కేసు ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. ప్రస్తుతం హైకోర్టు బెయిల్‌తో చంచల్ గూడ జైలు నుండి విడుదల అయినా అల్లు అర్జున్. డిసెంబర్‌ 13వ తేదీన అల్లు అర్జున్‌కు హైకోర్టు.. నాలుగు వారాల మద్యంతర బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.  జనవరి పదో తేదీతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ పర్మిషన్‌ ముగియనుంది. 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)