Breaking News

నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం

Published on Tue, 01/09/2024 - 01:11

నల్లగొండ టూటౌన్‌: నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన చైర్మన్‌ సైదిరెడ్డిపై అవిశ్వాసం పెట్టాలని గత నెల 8వ తేదీన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయగా.. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ అధ్యక్షతన మున్సిపల్‌ సమావేశం నిర్వహించారు.

ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కలిపి 50 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో అవిశ్వాస సమావేశానికి 47 మంది హాజరయ్యారు. ఇద్దరు ఎక్స్‌ అఫీషియో సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డితో పాటు బీజేపీ కౌన్సిలర్‌ బండారు ప్రసాద్‌ సమావేశానికి రాలేదు. 41 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు పైకి ఎత్తారు. వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు చేతులు ఎత్తారు.

కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచి సస్పెన్షన్‌కు గురైన పిల్లి రామరాజుయాదవ్‌ తటస్థంగా ఉన్నారు. కాంగ్రెస్‌ కౌన్సిలర్లు 35 మందితో పాటు బీజేపీ కౌన్సిలర్లు నలుగురు, గత ఎన్నికలకు ముందు బీజేపీ, ఎంఐఎం నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు ఎత్తడంతో 41 మంది మద్దతు లభించింది. 

ప్రభుత్వానికి నివేదిక 
నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డిపై అవిశ్వాసం నెగ్గిన నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలతో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఎన్నికల సంఘం నుంచి తదుపరి ఆదేశాలు రాగానే చైర్మన్‌ ఎన్నిక కోసం 50 మంది సభ్యులకు నోటీసులు అందించనున్నారు. ఆ తరువాత సమావేశం నిర్వహించి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)