Breaking News

మైలారంలో ఉద్రిక్తత.. పోలీసులు రాకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచె

Published on Mon, 01/20/2025 - 11:08

సాక్షి, నాగర్‌ కర్నూలు జిల్లా: బల్మూర్ మండలం మైలారం(Mylaram) గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైనింగ్ వెలికితీతను నిలిపివేయాలంటూ గత మూడు నెలలుగా ఆ గ్రామ రైతులు(Farmers), ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో​ సోమవారం మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. దీంతో మహిళలను, రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు.  అచ్చంపేటలో ఉన్న మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని కూడా అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.

అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని  పౌర హక్కు నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ గ్రామానికి పోలీసులు రాకూడదని.. గ్రామ ప్రధాన రహదారిపై ముళ్ళ కంచె వేసి పెద్ద ఎత్తున పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు నినాదాలు చేశారు.

అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ రైతు ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని తక్షణం విడుదల చేయకపోతే మందు తాగి చావడానికైనా సిద్ధమంటూ మందు డబ్బులతో రైతులు, మహిళలు రోడెక్కి నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)