Breaking News

పోషకాల‘పుట్ట’ గొడుగులు

Published on Mon, 07/28/2025 - 05:04

కరకగూడెం: వర్షాకాలం ప్రారంభం కాగానే అటవీ ప్రాంతంలో పుట్టగొడుగులు పెరుగుతుంటాయి. గ్రామాల్లో మొలిచే పుట్టగొడుగులతో పోలిస్తే అటవీ ప్రాంతంలో పెరిగేవి గిరిజన, ఆదివాసీల ఆహారంలో ఏళ్లుగా భాగమవుతున్నాయి. అంతేకాక వీటి అమ్మకం ద్వారా గిరిజనులు ఆర్థిక వనరుగా ఉపయోగించుకుంటున్నారు. గిరిజన, ఆదివాసీలు పుట్టగొడుగులను సేకరించి చిన్న కట్ట రూ.50కి, కేజీ రూ.500–రూ.700 వరకు ప్రాంతాల ఆధారంగా విక్రయిస్తుంటారు. ఏటా ఈ సీజన్‌లో మాత్రమే దొరికేవి కావడంతో ఆదరణ కూడా బాగుంటోంది. 

పుట్టగొడుగుల రకాలు.. గుర్తింపు 
గిరిజన ప్రాంతాల్లో తెల్ల, నల్ల పుట్టగొడుగులు కనిపిస్తాయి. అయితే, ఇందులో తినదగినవే కాక విషపూరితమైనవి కూడా ఉంటాయి. వీటి మధ్య తేడాను గుర్తించే పరిజ్ఞానం గిరిజనులకు అనాదిగా వస్తుండటంతో సులువుగానే సేకరిస్తుంటారు. పుట్టగొడుగుల రంగు, ఆకారం, వానే కాక అవి పెరిగిన ప్రదేశం ఆధారంగా తినదగినవా, విషపూరితమైనవా అన్నది గుర్తిస్తారు. 

తేమతో కూడిన వాతావరణంలో చెట్ల మొదళ్ల వద్ద, కుళ్లిన కలపపై లేదా మట్టిలో మొలి చే పుట్టగొడుగులను జాగ్రత్తగా సేకరిస్తారు. వీటితో కూ ర, పులుసులు, వేపుళ్లు, కొన్ని ప్రాంతాల్లో పచ్చళ్లు చేసుకుంటుండగా.. ఎక్కువగా సేకరిస్తే సమీప సంతలు, పట్టణాల్లో అమ్ముతుంటారు. 

పోషకాల పవర్‌హౌస్‌ 
పుట్టగొడుగులు రుచికరమైనవే కాకుండా, ప్రొటీన్లు, విటమిన్లు (ముఖ్యంగా విటమిన్‌ బీ, డీ,), సెలీనియం, కాపర్, పొటాíÙయం వంటి ఖనిజాలే కాక ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులలో ఉండే కొన్ని సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. తద్వారా వర్షాకాలంలో వచ్చే జ్వరాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. అలాగే కొన్ని రకాల పుట్టగొడుగులను సంప్రదాయ వైద్యంలో ఔషధాలుగానూ వినియోగిస్తారు. 

ఏటా ఎదురుచూస్తాం..  
వర్షాకాలం వస్తుందంటే పుట్టగొడుగుల కోసం ఎదురుచూస్తాం. అడవిలోకి వెళ్లి సేకరించడం అలవాటు. వీటితో వండిన కూర రుచిగా ఉంటుంది. అందుకే చిన్నాపెద్దలు ఇష్టంగా తింటారు. ఎక్కువగా దొరికినప్పుడు అమ్ముకోవడం ద్వారా కాస్త డబ్బులు కూడా వస్తాయి.  – సావిత్రి, మొగిలితోగు గ్రామస్తురాలు 

చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం..  
చిన్నప్పటి నుంచి పుట్టగొడుగులు తింటున్నాం. ఏది తినాలి, ఏది విషపూరితమైనదో పెద్దల ద్వారా తెలుసుకున్నాం. వర్షాకాలంలో తినడానికే కాక అమ్ముతూ ఎంతో కొంత సంపాదిస్తాం. అడవిలో సహజంగా దొరికేది కావడంతో మాకు బలాన్ని ఇస్తుందని తప్పక తింటాం.  – సమ్మయ్య, రేగళ్ల గ్రామస్తుడు  

ఆరోగ్యానికి ఎంతో మేలు 
పుట్టగొడుగుల్లో ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రోగనిరోధక శక్తి పెంచడం, వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల కట్టడికి ఉపయోగపడతాయి. ఇందులో ఏవి తినదగ్గవో సరిగ్గా గుర్తించకపోతే ప్రాణాంతకం అవుతాయి. అందుకే ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి.  – రవితేజ, వైద్యాధికారి, కరకగూడెం పీహెచ్‌సీ  

#

Tags : 1

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)