Breaking News

మాయలేడి.. జగత్‌ కిలాడి!

Published on Fri, 12/06/2024 - 12:48

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ రుద్రారపు హరీశ్‌ మృతికి కారణమైన యువతిపై ఆరా తీస్తున్న పోలీసులకు, నిఘావర్గాలకు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. యువతి గత మూడేళ్లలో ప్రేమ పేరిట ట్రాప్‌ చేసిన వారిలో ఎస్‌ఐ హరీశ్‌ నాలుగో వ్యక్తిగా చెబుతున్నారు. పూర్వ నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన యువతి స్కెచ్‌ వేస్తే చాలు.. ఎదుటివారికి దిమ్మతిరిగి పోవాల్సిందే. కొంతకాలం హైదరాబాద్‌ హయత్‌నగర్‌ ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పలువురిని ఆకట్టుకుని, ఆపై వారిని అష్టకష్టాలు పెట్టినట్లు ఒక్కొక్కొటిగా విషయాలు బయటకొస్తున్నాయి. 

ఇప్పటికే ఆ యువతిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కావడానికి కారణంతో పాటు ఓ ఎస్‌ఐ, మరో న్యాయమూర్తిపై ప్రైవేట్‌ కంప్లయింట్‌ చేయడం పూర్వ నల్లగొండ జిల్లాలో అప్పట్లో సంచలనంగా మారింది. విజయనగరానికి చెందిన ఓ యువకుడిపై సూర్యాపేట జిల్లాతో పాటు హయత్‌నగర్‌లోనూ తనను ప్రేమించి మోసం చేసినట్లుగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.  

అన్నీ గుర్తించే దూరం పెట్టిన హరీశ్‌? 
కొద్దిరోజులుగా ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా చిట్‌చాట్‌ చేసిన ఎస్‌ఐ హరీశ్‌.. ఆమె గురించి పలు విషయాలు తెలిశాకే దూరం పెట్టారన్న చర్చ జరుగుతోంది. తనకున్న సోర్స్‌ ద్వారా ఆమె ప్రవర్తన తెలుసుకున్న హరీశ్‌ ఆమెను దూరం పెట్టారని మరో వాదన వినిపిస్తున్నది. అయితే ఇటీవల హరీశ్‌కు హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతితో సంబంధం కుదిరి ఈనెల 14న నిశి్చతార్థం కూడా జరగబోతున్నదని తెలుసుకున్న సదరు యువతి మళ్లీ వెంటబడినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఈనెల 1న నేరుగా వాజేడు పోలీసుస్టేషన్‌కే చేరుకున్న ఆమె.. హంగామా చేసి పరువు తీసే ప్రయత్నాన్ని హరీశ్‌ పసిగట్టాడు. 

ఈ క్రమంలో రాజీ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో ఆ మాయలేడి పన్నాగంలో చిక్కుకుని విలవిల్లాడిన హరీశ్‌.. ప్రాణంకంటే పరువుకే అధిక ప్రాధాన్యం ఇచ్చి తనువు చాలించడం అందరినీ కలచి వేసింది. కాగా, తమ కుమారుడి ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఆ యువతిని విచారించి న్యాయం చేయాలని హరీశ్‌ తండ్రి రుద్రారపు రాములు తాజాగా పోలీసు అధికారులను కోరారు. ఇదే సమయంలో హరీశ్‌ సోదరుడు, సీఆర్‌పీఎఫ్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న కుమారస్వామి కూడా గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన సోదరుడి ఆత్మహత్యపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.  

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు