Breaking News

సమయస్ఫూర్తి చూపి.. గర్భిణిని కాపాడి..

Published on Wed, 07/22/2026 - 12:39

వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి, పెద్దగొళ్లగూడెం గ్రామాల మధ్య ఇసుకవాగు బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన డైవెర్షన్‌ రోడ్డు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొట్టుకు పోయింది. దీంతో మంగళవారం వాగు అవతలి వైపున ఉన్న 25 గ్రామాల ప్రజలతో పాటు ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి. 

రహదారి తెగక ముందు గర్భిణులను పరీక్షల నిమిత్తం వైద్యశాలకు తీసుకురావడానికి వాగు దాటి వెళ్లిన 102 అంబులెన్స్‌ తిరిగి వారిని తీసుకొస్తున్న సమయంలో రహదారి కొట్టుకుపోవడంతో కొద్దిసేపు అక్కడే ఉంది. తర్వాత వారిని పేరూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, అయ్యవారిపేట గ్రామానికి చెందిన కావిరి వసంత (అనూష) 5వ కాన్పు కోసం పేరూరు వైద్యశాలకు వెళ్లగా.. నొప్పులు వస్తుండటంతో ఏటూరునాగారం తరలించాలని సిబ్బంది భావించారు. నొప్పులు ఎక్కువ కావడంతో ఉన్నతాధికారుల సలహా మేరకు కాన్పు చేశారు. 

తల్లికి రక్తం తక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏటూరునాగారం రిఫర్‌ చేశారు. అయితే చీకుపల్లి–పెద్దగొళ్లగూడెం గ్రామాల మధ్య రహదారి తెగిపోవడంతో ఎలా పంపించాలో అర్థంకాని ఆస్పత్రి సిబ్బంది.. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్సైలకు విషయం తెలిపారు. స్పందించిన వారు ట్రాక్టర్‌ ఏర్పాటు చేసి వాగు ఉధృతి తక్కువగా ఉన్నచోట నుంచి కోయవీరాపురం గ్రామం వరకు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈలోగా సిద్ధంగా ఉన్న 108 అంబులెన్స్‌లో ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)