Breaking News

మిసెస్‌ చికాగోగా తెలుగమ్మాయి.. ఎవరీ సౌమ్య?

Published on Mon, 09/15/2025 - 12:35

ధర్మపురి: ఈనెల 12న న్యూజెర్సీలోని రాయల్‌ ఆల్బర్ట్స్‌ ప్యాలెస్‌లో నిర్వహించిన విశ్మసుందరి అందాల పోటీల్లో మిసెస్‌ చికాగో యూనివర్స్‌–2026 టైటిల్‌ గెలుచుకున్న సౌమ్య స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి. ధర్మపురికి చెందిన వొజ్జల మోహన్, సావిత్రి దంపతుల కూతురు సౌమ్య.. 2025 మే 4న మిసెస్‌ భారత్‌ ఇల్లినాయిస్‌ అందాల పోటీల్లో విజయం సాధించారు. తాజాగా మిసెస్‌ చికాగో యూనివర్స్‌ను గెలుచుకోవడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1985 జనవరి 22న జన్మించిన సౌమ్య బెంగళూర్, నాగాపూర్, ముంబయి, దహను నగరాల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు.

 ధర్మపురికి చెంది.. అమెరికాలో స్థిరపడిన బొజ్జ వాసుతో వివాహమైంది. అనంతరం మిల్వాకి యూనివర్సిటీ నుంచి బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ డిగ్రీ పొందారు. ప్రస్తుతం ఆమె ఓ బహూళజాతి సంస్థలో వెబ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్, కొరియోగ్రఫీపై ఉన్న మక్కువతో ఇల్లినాయిస్‌లోని చికాగోలో వస్త్రం బై సౌమ్య అనే ఫ్యాషన్‌ బోటిక్‌ను స్థాపించారు. 2025లో న్యూయార్క్‌లో ఫ్యాషన్‌ వీక్‌ డిజైనర్‌గా అడుగుపెట్టబోతున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతోపాటు సామాజిక కార్యకర్తగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. గృహహింస బాధితులకు సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సౌమ్య తాజాగా ఈ ఏడాది మార్చిలో ధర్మపురికి వచ్చి వెళ్లారు. 

కుటుంబం ప్రోత్సాహంతో..
విశ్వసుందరి పోటీల్లో టైటిల్‌ గెలుచుకోవడంలో తల్లిదండ్రులు, భర్త సహాయం బాగుంది. ప్రతిభ, అంకిత భావం, కృషి, పట్టుదలతోనే ఈ స్థాయికి ఎదిగాను. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తా.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)