Breaking News

ఫీజు చెల్లించలేక కూలి పనికి..

Published on Mon, 11/25/2024 - 04:21

మిర్యాలగూడ: ఉన్నత చదువు చదవాలన్నది ఆ గిరిజన బిడ్డ తపన.. కానీ, ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో కూలి పనులకు వెళ్తూ కష్టపడుతోంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంక్‌ తండాకు నూనావత్‌ లింగా, శాంతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు మౌనిక, చిన్న కూతురు కల్యాణి. మౌనిక మూడేళ్ల వయసులో తల్లి మరణించగా.. తండ్రి మరో పెళ్లి చేసుకుని తన దారి తాను చూసుకున్నాడు. 

అప్పటి నుంచి మౌనిక, కల్యాణిల బాగోగులు అమ్మమ్మ, మామయ్యలు చూసుకుంటున్నారు. చదువు కోసం మౌనికను నల్లగొండ చారుమతి అనాథాశ్రమంలో చేర్పించగా.. ఇంటర్‌ బైపీసీలో 9.9 గ్రేడ్‌ మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఈ తరువాత శ్యామల నాగసేనారెడ్డి అనే వ్యక్తి ప్రోత్సాహంతో ఈఏపీ సెట్, నీట్‌ పరీక్షలు రాసి మంచి ర్యాంకు తెచ్చుకుంది. 

మహబూబాబాద్‌ జిల్లా మాల్యాలలోని హార్టీకల్చర్‌ కళాశాలలో కన్వీనర్‌ కోటాలో మౌనికకు సీటు వచ్చింది. మౌనిక చదువుకు అమ్మమ్మ బాణావత్‌ లచ్చి, మేనమామ శ్రీను కొంత సాయం చేస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో ఫీజు చెల్లించే స్థోమత వారికి లేదు. తన చదువుకు అవసరమైన ఫీజు చెల్లించేందుకు దాతలు చేయూతనివ్వాలని మౌనిక వేడుకుంటోంది.  

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)