Breaking News

TS: చలాన్ల చెల్లింపులపై భారీ స్పందన.. రూ. 67 కోట్లు వసూలు

Published on Sat, 01/06/2024 - 09:37

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల క్లియరెన్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపులకు ప్రభుత్వం భారీగా డిస్కౌంట్‌ ఇచ్చిన నేపథ్యంలో వాహనాదారులు చలాన్లను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 76లక్షలకు పైగా చలాన్లను క్లియర్‌ చేసుకున్నారు. 

రాష్ట్రంలో మూడు కోట్ల 59 లక్షల పెండింగ్‌ చలాన్స్‌ కట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 77  లక్షల చలాన్లు క్లియర్‌ చేసినట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ విశ్వ ప్రసాద్‌ తెలిపారు. ఈ చలాన్లకు సంబంధించి శనివారం వరకు రూ. 67  ​కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ కమిషరేట్‌లో రూ. 18 కోట్లు, సైబరాబాద్‌ కమిషనరేట్‌లో రూ. 14 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌లో రూ. 7.15 కోట్లు వసూలయ్యాయని చెప్పారు.

ట్రాఫిక్‌ చలాన్ల వెబ్‌సైట్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఫేక్‌ చలాన్‌ వెబ్‌సైట్‌లను నిలిపివేశామని తెలిపారు. మరోవైపు.. చలాన్ల పెండింగ్‌పై వాహనదారుల స్పందనను గమనించిన ప్రభుత్వం.. చలాన్ల చెల్లింపులపై మరింత వెసులుబాటు కల్పించింది. ఈనెల పదో తేదీ వరకు డిస్కౌంట్‌తో చలాన్లను చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. 

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)