Breaking News

ఆరోగ్యం సహకరించడం లేదు.. దీక్ష విరమిస్తున్నా

Published on Wed, 07/03/2024 - 04:25

గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్‌) : ‘ఆరోగ్యం సహకరించడం లేదు.. శరీరంలోని అన్నీ అవయవాలు కొంతమేర శక్తిని కోల్పోయాయి. అందుకే నిరాహార దీక్ష విరమిస్తున్నా. ప్రలోభాలకు లొంగలేదు..తొమ్మిది రోజులు ఆహారం తీసుకోకుండా నిరుద్యోగుల కోసం పోరాటం చేశాను. ఇకపై ఆహారం తీసుకుంటూ ఉద్యమిస్తా.. త్వరలోనే ఐక్య కార్యాచరణ ప్రకటిస్తా’ అని నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌నాయక్‌ స్పష్టం చేశారు. తొమ్మిది రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న ఆయన మంగళవారం ఉదయం గాంధీ ప్రాంగణంలో కొబ్బరినీళ్లు తాగి దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పలుపార్టీల నేతలు, సంఘ నాయకులు కలిసి ఉద్యమం చేద్దామనే పిలుపు మేరకు దీక్ష విరమించానని, రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పారు. తన దీక్షకు సంఘీభావం ప్రకటించిన అందరినీ కలిసి మద్దతు కూడగట్టి, నిరుద్యోగుల సత్తా చూపిస్తామని, ప్రభుత్వ మెడలు వంచి న్యాయమైన డిమాండ్లు సాధించుకుంటామన్నారు. తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, ఇకపై పాముకాటు ఎలా ఉంటుందో చూపిస్తానని సవాల్‌ విసిరారు. 

మరణిస్తే ఉద్యమం చేయలేనని, బతికి డిమాండ్లు సాధించుకుంటామని, రోజుకో తీరుతో విభిన్న తరహాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విశ్రమించనని శపథం చేశారు. తెలంగాణలోని పలు రాజకీ యపార్టీలు, సంఘాలు, నిరుద్యోగులు తన వెనుక ఉన్నారని, త్వరలోనే 10 లక్షల మందితో నిరుద్యోగ మార్చ్‌ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మంత్రి సీతక్క ఫోన్‌ చేసి మాట్లాడింది వాస్తమేనన్నారు. నగరంలోని అశోక్‌నగర్‌ సిటీ సెంట్రల్‌ లైబ్రరీ నుంచి తన కార్యాచరణ ప్రారంభమవుతుందని చెప్పారు. న్యాయమైన డిమాండ్లు సాధించేవరకు తన పోరాటం ఆగదన్నారు. 

నగర కేంద్ర గ్రంథాలయానికి మోతీలాల్‌నాయక్‌ 
మోతీలాల్‌ నాయక్‌ దీక్ష విరమించిన అనంతరం  చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించారు. లక్షలాది మందితో మరో 10 రోజుల్లో టీజీపీఎస్‌సీని ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. సిటీ లైబ్రరీ నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)