Breaking News

అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతి

Published on Sun, 04/13/2025 - 08:03

మిర్యాలగూడ అర్బన్‌: అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన శనివారం మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో చోటు చేసుకుంది. మిర్యాలగూడ వన్‌ టౌన్‌ సీఐ మోతీరాం తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి ఓ ప్రైవేట్‌ ఆగ్రో కెమికల్‌ కంపెనీకి నల్లగొండ జిల్లా సెల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తూ మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డులో అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. ఈ నెల 10వ తేదీన కంపెనీ పని మీద సీతారాంరెడ్డి  హైదరాబాద్‌కు వెళ్లగా.. 

ఆయన భార్య రాజేశ్వరి(34), చిన్న కుమార్తె వేదసాయిశ్రీ(13)తో పాటు పెద్ద కుమార్తె వేదశ్రీ ఇంటి వద్దనే ఉన్నారు. హైదరాబాద్‌లో పని ముగించుకొని శనివారం తిరిగి మిర్యాలగూడకు వస్తుండగా.. సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె “ఎక్కడ ఉన్నావు డాడీ’ అంటూ మెసేజ్‌ చేసింది. దీంతో “ఇంటికి వస్తున్నాను’ అంటూ సీతారాంరెడ్డి రిప్లై ఇచ్చాడు. అనంతరం కాల్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. సాయంత్రం 5గంటలకు సీతారాంరెడ్డి ఇంటికి వచ్చేసరికి పెద్ద కుమార్తె వేదశ్రీ తలుపు తీసుకొని తండ్రి వద్దకు పరుగెత్తుకు వచ్చింది. 

లోపలికి వెళ్లి చూడగా చిన్న కుమార్తె వేదసాయిశ్రీ మెడపై గాయంతో రక్తపుమడుగులో పడి ఉంది. బెడ్‌రూం వైపు వెళ్లి చూడగా రూం లోపల నుంచి గడియపెట్టి ఉంది. స్థానికుల సహాయంతో తలుపులు పగులగొట్టి చూడగా చీరతో రాజేశ్వరి ఉరేసుకుని కనిపించింది. వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయగా.. మిర్యాలగూడ వన్‌ టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 

హత్యా..? ఆత్మహత్యా..?
సీతారాంరెడ్డి పెద్ద కుమార్తెను పోలీసులు ప్రశ్నించగా.. తాను నిద్రపోయామని చెబుతుండడంతో తల్లి, కుమార్తెది హత్యా..? లేక ఆత్మహత్యా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న వన్‌ టౌన్‌ సీఐ మోతీరాం, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు మృతదేహాలను పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్‌ టీంను పిలిపించి ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. తల్లి, కుమార్తె మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తామని, మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)