Breaking News

విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Published on Tue, 03/03/2026 - 10:26

సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: గొల్లెగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన కూతురు(10 నెలలు), కుమారుడి(2)ని చంపి అనంతరం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడని స్థానికులు తెలిపారు.

మరో ఘటనలో..
కాగా, మరో ఘటనలో నిరుపయోగంగా ఉన్న మిల్లులో ఉరేసుకుని వలస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నేరేడుచర్ల పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రవీందర్‌నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రంలోని కోటక్‌ జిల్లాకు చెందిన శ్రీధర్‌(25) నేరేడుచర్ల పట్టణంలో నిరుపయోగంగా ఉన్న చాణక్య రైస్‌ మిల్లు పక్కనే ఉన్న ఒడిశా దాబాకు అప్పుడప్పుడు వచ్చి కొన్నిరోజులు అక్కడే పనిచేసి తిరిగి సొంతూరుకు వెళ్తుంటాడు.

ఈ క్రమంలో గత నెల 25న దాబాకు వచ్చిన శ్రీధర్‌ మూడురోజులు పనిచేసి తిరిగి ఊరికి వెళ్తున్నానంటూ దాబా యాజమాని వద్ద రూ.3వేలు తీసుకుని వెళ్లాడు. అయితే సోమవారం చాణక్య రైస్‌ మిల్లు నుంచి దుర్వాసన వస్తుండడంతో పరిసర ప్రాంతాల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మిల్లులోకి వెళ్లి పరిశీలించగా శ్రీధర్‌ ఉరేసుకుని కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు, మూడు రోజుల క్రితమే శ్రీధర్‌ ఉరేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)