Breaking News

తగ్గుతున్న ఐఐటీల ప్రభ

Published on Sun, 06/15/2025 - 01:37

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తొలి దశ సీట్ల కేటాయింపును జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) శనివారం వెల్లడించింది. ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లు సహా జాతీయ ఇంజనీరింగ్‌ (ఎన్‌ఐటీలు), ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు (జీఎఫ్‌టీఐలు) మొత్తం 127 సంస్థలు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. వీటి పరిధిలో 62,854 సీట్లు ఉన్నాయి. 

ఈ ఏడాది మొత్తం ఆరు దశల్లో కౌన్సెలింగ్‌ చేపట్టాలని జోసా ఈ ఏడాది నిర్ణయించింది. తొలి దశ కౌన్సెలింగ్‌లో ఐఐటీల్లో 18,160 సీట్లను భర్తీ చేశారు. సామాజిక కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు జరిగినట్టు జోసా వెల్లడించింది. జాతీయస్థాయి టాప్‌ ర్యాంకర్లంతా ఐఐటీ బాంబేలోనే సీట్లు పొందారు. అందులోనూ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ కోర్సులకు అన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రధానంగా ఆప్షన్లు ఇచ్చారు. 

మారిన ట్రెండ్‌
గతంతో పోలిస్తే ఈసారి జోసా కౌన్సెలింగ్‌ భిన్నంగా కన్పిస్తోంది. ఎక్కువ ర్యాంకులు వచ్చినవారికి కూడా తొలి దశలోనే సీట్లు వచ్చాయి. గత ఏడాది ఆఖరి రౌండ్‌లో కూడా ఐఐటీల్లో జనరల్‌ కేటగిరీలో కటాఫ్‌ (బాలుర విభాగం) 6,375 దాటలేదు. ఈసారి తొలి రౌండ్‌లోనే 6,242 ర్యాంకు విద్యార్థికి కూడా సీటు వచ్చింది. తాజా కౌన్సెలింగ్‌ను గమనిస్తే జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీలపై విద్యార్థులకు ఆసక్తి తగ్గుతున్నట్టు కన్పిస్తోంది. 

కోవిడ్‌ తర్వాత జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌కు విద్యార్థులు సీరియస్‌గా సన్నద్ధమవ్వడం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు రాష్ట్రాల్లో ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, అటానమస్‌ సంస్థలు, ప్రైవేటు వర్సిటీలు పెరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీల కోసం పోటీ పడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కూడా కఠినంగా ఉంటోందని విద్యార్థులు భావిస్తున్నారు. ఇదే ట్రెండ్‌ కొనసాగితే ఐఐటీల నాణ్యత ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

మంచి ర్యాంకు రాకున్నా... ఆఖరివరకూ నిరీక్షించాలి
మంచి ర్యాంకు రాకున్నా ఈసారి ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీట్లు వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఎందుకంటే పోటీ తక్కువగానే కన్పిస్తోంది. వేలల్లో ర్యాంకులు ఉన్న వారికి ఈసారి సీట్లు వచ్చే వీలుందని భావించాలి. బ్రాంచీ, సంస్థ విషయంలో కొంత ఆలోచించి అడుగేయాలి.  – ఎంఎన్‌ రావు (జేఈఈ అధ్యాపకులు) 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)