Breaking News

రెగట్టాలో మనోళ్ల హవా

Published on Thu, 07/18/2024 - 11:27

సాక్షి, హైదరాబాద్‌: నగరం వేదికగా కొనసాగుతున్న సెయిలింగ్‌ మాన్‌సూన్‌ రెగట్టా పోటీల్లో మరోసారి తెలంగాణ సెయిలర్లు రాణిస్తున్నారు. సాగర్‌లో జరుగుతున్న 15వ మాన్‌సూన్‌ రెగట్టాలో బుధవారం అండర్‌–16 ఆప్టిమిస్ట్‌ ఫ్లీట్‌లో ఉద్బవ్‌ స్కూల్‌ నుంచి గోవర్ధన్‌

పల్లార, లాహిరి కొమరవెల్లి, దీక్షిత కొమరవెల్లి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. గోవర్ధన్‌ తన విజయాలతో రెండవ స్థానం కన్నా ముందే ఉన్నప్పటికీ అగ్రస్థానం కోసం మరో 4 రేసులతో నైపుణ్యాలను ప్రదర్శించాలి. సెయిలింగ్‌ స్టార్‌ లాహిరికి ఓ ప్రమాదంలో ఎడమ చేయి విరగడంతో మొదటి రెండు రేసులకు అనుమతించలేదు. చివరకు వైద్యుడి పర్యవేక్షణలో అనుమతించడంతో లాహిరి ఒక రేసులో మొదటి స్థానంలో నిలిచింది. అయినప్పటికీ 39 సెయిలర్‌ ఫ్లీట్‌లో ప్రశంసనీయంగా 19వ స్థానంలో నిలిచింది.

 ఐఎల్‌సీఏ 4 బాలుర విభాగంలో టీఎస్‌సీ మైసూర్‌కు చెందిన కృష్ణ దివాకర్‌ మధ్యప్రదేశ్‌కు చెందిన ఏకలవ్య బాథమ్‌ (3వ స్థానం)ను బీట్‌ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. శశాంక్‌ బాథమ్‌ రెండవ స్థానంలో ఉన్నాడు. బాలికల విభాగంలో సోమ్యా సింగ్, అలియా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంటర్నేషనల్‌ 420 మిక్స్‌డ్‌ లోకల్స్‌లో తనుజా కామేశ్వర్, వైష్ణవి అగ్రస్థానంలో నిలిచారు. బాలికల హాఫ్‌ రిగ్‌ ఫ్లీట్‌లో అఖిల కొప్పుల (13) స్వర్ణం, రెయిన్‌బో హోమ్స్‌ ముషీరాబాద్‌కు చెందిన నికిత జీరు (12) రజతం సాధించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)