Breaking News

కోతిని మింగిన కొండచిలువ

Published on Tue, 10/28/2025 - 07:54

పెద్దపల్లి జిల్లా(మంథని): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలో ఓ కొండచిలువ కోతిని మింగి మిగతా వాటి దాడిలో హతమైంది. గ్రామానికి చెందిన చొప్పరి రవి నివాసం ఎదుట సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామశివారులోని చెట్లపొదల్లోంచి జనావాసాల్లోకి చేరుకున్న ఓ కొండచిలువకు కోతుల గుంపు కనిపించింది. దీంతో వాటివైపు కదిలిన కొండచిలువ.. తొలుత చిన్నకోతిపిల్లను మిగింది. 

మరో పెద్దకోతిని మింగేందుకు యత్నించగా.. బిగ్గరగా అరిచింది. దీంతో సమీపంలోని సుమారు కోతులు గల గుంపు ఒక్కసారిగా వచ్చి కొండచిలువపై దాడిచేశాయి. ఆ దాడిలో కొండచిలువ చనిపోగా పెద్దకోతి ప్రాణాలతో బయటపడింది. కొండచిలువ భయానికి స్థానికులెవరూ అటువైపు వెళ్లలేదు. సమాచారం అంతుకున్న బేగంపేట ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ నర్సయ్య, బీట్‌ ఆఫీసర్‌ పవన్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువ పొడవు 6 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. దానికి పంచనాబా చేసి అటవీప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు వివరించారు. 

హార్వెస్టర్‌లో పడి కొండచిలువ హతం
చందుర్తి(వేములవాడ): వరికోత కోస్తుండగా హార్వెస్టర్‌లో పడి కొండచిలువ హతమైంది. చందుర్తి మండలం కట్టలింగంపేటకు చెందిన రైతు యెల్ల నరేశ్‌కు చెందిన వరి పొలం కోస్తుండగా హార్వెస్టర్‌లో కొండచిలువ చిక్కి మిషన్‌ ఆగిపోయింది. మిషన్‌లో చిక్కిన గడ్డిని తొలగిస్తుండగా.. ఆ గడ్డిలోనే కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో అక్కడే ఉన్న రైతులు పెద్ద కొండచిలువ అంటూ పరుగులు పెట్టారు. ఆపరేటర్‌ మిషన్‌లో చిక్కిన కొండచిలువను తొలగించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)