Breaking News

Heart Attack: అయ్యో పాపం ‘వెంకటస్వామి’

Published on Wed, 09/18/2024 - 13:39

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): బదిలీ అయ్యి పాఠశాలలో విద్యార్థులకు పరిచయం కాకముందే  ఆ ఉపాధ్యాయుడిని విధి కాటేసింది. ఇంటి వద్ద కాలకృత్యాలకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకరమైన ఘటన మండలంలోని అలిరాజ్‌పేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ధ్యాప వెంకటస్వామి(42), మంజుల (ఉపాధ్యాయురాలు), ఇద్దరు కుమార్తెలు సుష్మిత మిత్ర, అక్షర మిత్ర ఉన్నారు. వెంకటస్వామి గజ్వేల్‌ మోడల్‌ స్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుడిగా 11 ఏళ్లుగా పని చేస్తున్నాడు. భార్య మంజుల జగదేవ్‌పూర్‌ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. 

అలిరాజ్‌పేట గ్రామం నుంచి గజ్వేల్‌కు మారి నూతనంగా ఇల్లు నిర్మించుకొని గత నెల 23న గృహ ప్రవేశం చేశారు. ఈ నెల 14న ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా గజ్వేల్‌ నుంచి జగదేవ్‌పూర్‌ మోడల్‌ స్కూల్‌కు బదిలీ అయ్యారు. అదే రోజు సాయంత్రం పాఠశాలలో బాధ్యతలు తీసుకున్నారు. సోమవారం గజ్వేల్‌లోని కొత్త ఇంటిలో కాలకృత్యాలకు వెళ్లగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. వైద్యులు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.  

సామాజిక కార్యక్రమాలు.. 
వెంకటస్వామి ఉపాధ్యాయుడికి ముందు సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. సామాజిక పాటలపై ప్రేమతో 11 పాటలను సొంత ఖర్చులు, దర్శకత్వంతో తీశారు. గ్రామానికి చెందిన పల్లెటూరి హీరో అనిల్‌ మొగిలితో 7 పాటలకు దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించారు. అలాగే రైతుల ఆత్మహత్యలపై పాటలకు నిర్మాత, దర్శకత్వం వహించారు.  

నేత్రదానం.. 
వెంకటస్వామి మృతి చెందిన వెంటనే లోక్‌ నేత్ర ట్రస్టు వారికి అతడి కళ్లను దానం చేశారు. నేత్రదానం చేసి మరొకరికి చూపు ఇవ్వడంతో గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయులు ఆ కుటుంబాన్ని అభినందించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్‌శర్మ, మండలాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘూల నేతలు శంకర్, సత్తయ్య, ప్రవీణ్, వెంకట్‌ కిరణ్, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు నివాళులరి్పంచారు.

  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)