Breaking News

ప్రార్థన మందిరం వద్ద ఎన్నికల ప్రచారం చేశారని..

Published on Sun, 10/12/2025 - 13:50

హైదరాబాద్‌: మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ (ఎంసీసీ)ను ఉల్లంఘించి ప్రార్థన స్థలాల వద్ద అనుమతులు తీసుకోకుండా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు మాగంటి అక్షర, యూసుఫ్‌గూడ కార్పొరేటర్‌ రాజ్‌కుమార్‌ పటేల్‌తో పాటు మరో నలుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు అక్షరతో పాటు కార్పొరేటర్‌ రాజ్‌కుమార్‌ పటేల్, బీఆర్‌ఎస్‌ నేతలు ఆజం అలీ, అంజద్‌ అలీఖాన్, ఫయీం, షఫీ తదితరులు పార్టీ కండువాలు వేసుకుని వెంకటగిరిలోని ఓ ప్రార్థన మందిరం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కరపత్రాలతో కనిపించారు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ డిప్యూటీ తహసీల్దార్‌ ఫ్రాన్సిస్‌ గమనించి సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో మాగంటి సునీతతో పాటు ఆమె కూతురు, ఇతర నేతలు చేతుల్లో కార్డులు పట్టుకొని ప్రార్థనలు చేసి వచి్చన వారిని ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తించారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధమని, మతపరమైన ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ప్రచారాలు చేయకూడదని ఎన్నికల నిబంధనలు ఉన్నట్లు గుర్తించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ అధికారి ఫ్రాన్సిస్‌ తెలిపారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)